MLA Harish Rao : కాంగ్రెస్ సర్కార్ పై భగ్గుమన్న మాజీ మంత్రి హరీష్ రావు

ఎమ్మెల్యేలకు ఇచ్చిన శిక్షణ ఇదేనా అధ్యక్ష అంటూ హరీష్‌రావు సెటైర్లు గుప్పించారు...

Harish Rao : సర్పంచులకు బిల్లులు ఇవ్వకుండా గోస పెడుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ(సోమవారం) ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. తర్వాత సభలో ప్రభుత్వం రెండు కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అనంతరం ఇటీవల మృతిచెందిన మాజీ ఎమ్మెల్యేలు కొమిరెడ్డి జ్యోతి, ఊకే అబ్బయ్య, రామచంద్రారెడ్డికి శాసన సభ సంతాపం తెలుపనుంది. అనంతరం సభలో టూరిజం పాలసీపై లఘు చర్చ జరగనుంది. ప్రశ్నత్తోరాల సమయంలో హరీష్‌రావు(Harish Rao) మాట్లాడుతూ… గవర్నర్‌ను వెళ్లి కలవాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. 19గ్రామ పంచాయతీలకు అవార్డు తెచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని చెప్పారు. హరీష్‌రావు ప్రసంగానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డు తగులుతున్నారు.

MLA Harish Rao Comments

ఎమ్మెల్యేలకు ఇచ్చిన శిక్షణ ఇదేనా అధ్యక్ష అంటూ హరీష్‌రావు సెటైర్లు గుప్పించారు. తెలంగాణకు వెళ్తే చికెన్ గున్యా వస్తుందని అమెరికా ఆ దేశ పౌరులను హెచ్చరించిందని.. ఆ పరిస్థితికి పల్లెలను సీఎం రేవంత్‌రెడ్డి తెచ్చారని విమర్శించారు. పంచాయతీ సిబ్బందికి వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు పెన్షన్స్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారని గుర్తుచేశారు. పెన్షన్స్ ఏమో గాని అసలు వేతనాలే ఇవ్వడం లేదని హరీష్‌రావు అన్నారు. బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లి సర్పంచ్ బిల్లులు రాక ఇల్లును కుదువ పెట్టుకున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. బిల్లుల కోసం సర్పంచ్‌లు కలుద్దామని హైదరాబాద్‌కు వస్తే అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. సర్పంచ్‌లు చేసిన పనుల బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Also Read : CM Yogi Adityanath : సంభాల్ హింస ఘటనపై స్పందించిన యూపీ సీఎం యోగి

Leave A Reply

Your Email Id will not be published!