MLA Harish Rao : యువతను రెచ్చగొట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది
పరీక్ష.. పరీక్షకు మధ్య కనీసం రెండు నెలల వ్యవధి ఉండాలని..
MLA Harish Rao : కాంగ్రెస్ మోసం చేసిందని నిరుద్యోగ యువత ఆందోళన చేస్తోందని, యువతను రెచ్చగొట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) విమర్శించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బేషజాలకు వెళ్లకుండా నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని సూచించారు. గ్రూప్ 1లో వన్ ఈస్ట్ హండ్రెడ్ చొప్పున మెయిన్స్‌కు అవకాశం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక ఆ మాట ఎందుకు తప్పారని ప్రశ్నించారు. గ్రూప్ టూకు మరో 2 వేలు, గ్రూప్ త్రీకి మరో 3 వేల ఉద్యోగాలు జోడించి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
MLA Harish Rao Comment
పరీక్ష.. పరీక్షకు మధ్య కనీసం రెండు నెలల వ్యవధి ఉండాలని, అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా జాబ్ క్యాలండర్ ఎందుకు ఇవ్వలేదని హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మెగా డీఎస్పీ ఏమైందని నిలదీశారు. డీఎస్సీని11వేలకే ఎందుకు పరిమితం చేశారన్నారు. వచ్చే ఆరు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ పూర్తి చేయాలని, కోదండరామ్ కూడా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. కోదండరామ్ భాధ్యత తీసుకుని గౌరవం నిలుపుకోవాలని, విద్యార్థుల పక్షాన ప్రజా పోరాటానికి శ్రీకారం చుడతామని హరీష్ రావు పేర్కొన్నారు.
Also Read : Bengal Train Accident : వెస్ట్ బెంగాల్ రంగపాణి స్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం