MLA Harish Rao : మొదటిసారి భావోద్వేగ వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు
ఇది చాలా అద్భుతమైన రోజని.. ప్రజా జీవితంలోచాలా కార్యక్రమాలు చేస్తుంటామని....
Harish Rao : చిన్నపిల్లలకు గుండె సంబంధిత అన్ని శస్త్ర చికిత్సలు అందించే హార్ట్ సెంటర్‌గా కొండపాక సత్యసాయి సంజీవని కార్డియాలజీ, రీసెర్చ్ ఇన్స్‌స్టిట్యూట్ మారనుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తెలిపారు.ఈ ఇన్స్‌స్టిట్యూట్‌ను ట్రస్టు సభ్యులు శ్రీనివాస్, కేవీ రమణాచారితో కలిసి హరీష్‌రావు(Harish Rao) ఇవాళ(శనివారం) సందర్శించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ… ఈ ఆస్పత్రిలో ఈ నెల 23వ తేదీన చిన్నారుల గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు ప్రారంభమయ్యాయని హరీష్‌రావు(Harish Rao) తెలిపారు.
MLA Harish Rao Comments
ఇప్పటి వరకు 18 మంది చిన్నారులకు విజయవంతంగా ఆస్పత్రి వైద్యులు శస్త్ర చికిత్సలు నిర్వహించారని కొనియాడారు. శస్త్ర చికిత్సలు అయిన పిల్లల తల్లిదండ్రులను, ఆస్పత్రి వైద్యులను పలకరించి, పిల్లల ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఇది చాలా అద్భుతమైన రోజని.. ప్రజా జీవితంలోచాలా కార్యక్రమాలు చేస్తుంటామని.. కానీ ఈ రోజు ఇక్కడ ఆపరేషన్ జరిగి, గిఫ్ట్ ఆఫ్ లైఫ్ పొందిన పిల్లలను చూసి తన జన్మధన్యమైందని వ్యాఖ్యానించారు. ఇంత పెద్ద ప్రభుత్వాలు చేయలేని పనిని ఈ సంస్థ చేస్తుందని తెలిపారు.అప్పుడే పుట్టిన బిడ్డల గుండె జబ్బులకు శస్త్ర చికిత్సలు అందిస్తున్నారని చెప్పారు. దేశంలో ఈ ఆస్పత్రి ఐదోదని.. చుట్టుపక్కల రాష్ట్రాల ప్రాంతాలకు ఇది వరమని అన్నారు. గుండె జబ్బులకు సంబంధించి చికిత్సకు రూ. 5 లక్షల వరకూ ఖర్చు అవుతుందని హరీష్‌రావు తెలిపారు.
పేద,మధ్యతరగతి కుటుంబాలకు ఇది నిజంగా సంజీవని లాంటిదేనని ఉద్ఘాటించారు. ఇంతకంటే గొప్ప పని ఏముంటుందని అన్నారు. సంస్థ చైర్మన్ శ్రీనివాస్ పేదల ఆశీస్సులు పొందారన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులు ఇచ్చే కోట్ల రూపాయల ఆఫర్లను కాదని, ఇక్కడ సేవ చేస్తున్న వైద్యులు ఎంతో గొప్పవారని ప్రశంసించారు. వైద్య విద్య చదివిన వైద్యులు.. వారి చదువును పేదల సేవకు అందిస్తున్నారని చెప్పారు. ఇక్కడ వైద్యం పొందిన చిన్నారులు తాము డాక్టర్లమై ఇక్కడే ఉచిత వైద్య సేవలందిస్తామని చెబుతున్నారని.. స్ఫూర్తి ఇదని కొనియాడారు. ఇక్కడి విద్యాలయం ఒక యూనివర్సిటీగా మారాలని సూచించారు. ఇక్కడి ఆస్పత్రిలో నయం కానిది ఏదైనా ఉంటే దేశంలో అది ఎక్కడా నయం కాదని చెప్పారు. ఆరు రోజుల్లో 18 మంది పిల్లలకు గుండె ఆపరేషన్లు చేసి వారికి పునర్ జన్మనిచ్చి వారిని ఆనందంగా ఇంటికి పంపుతున్నారని చెప్పారు. మధుసూదనాచారి, సత్యసాయి వారు ఈ ప్రాంతానికి ఇచ్చిన వరం ఇదని హరీష్‌రావు తెలిపారు.
Also Read : MP Purandeswari : పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ పై స్పందించిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు