MLA Harish Rao : కేటీఆర్ అరెస్ట్ పై వస్తున్న రూమర్స్ పై భగ్గుమన్న హరీష్ రావు
తమను మానసికంగా బలహీన పరిచ్చేందుకు రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు...
Harish Rao : ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీనిపై మాజీమంత్రి హరీష్‌రావు(Harish Rao) స్పందిస్తూ.. హైకోర్టు ఆర్డర్ కాపీ వచ్చాక సుప్రీం కోర్టుకు వెళ్ళే అంశంపై నిర్ణయిస్తామన్నారు. తదితర ఏం చేయాలనే దానిపై చర్చలు జరుపుతున్నామని అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే కేటీఆర్‌పై కేసు అని వ్యాఖ్యలు చేశారు.విచారణకు మాత్రమే హైకోర్టు అనుమతించిందని.. కేటీఆర్ తప్పు చేసినట్లు చెప్పలేదన్నారు. కానీ కొంతమంది కోర్టు ఉత్తర్వులను వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏసీబీ, ఈడీ విచారణకు కేటీఆర్ సహకరిస్తారని తెలిపారు. ఈనెల 9న ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవుతారని వెల్లడించారు. అక్రమ కేసులతో ప్రజల దృష్టిని మరలచటానికి రేవంత్ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులను ఎదుర్కోవటానికి తాము సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ‘‘అరెస్ట్ చేస్తే చేసుకోండి.. భయపడేది లేదు’’ అని అన్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తోందన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేసే వరకు రేవంత్‌ను వదలమన్నారు.
MLA Harish Rao Comments
తమను మానసికంగా బలహీన పరిచ్చేందుకు రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో సుప్రీం కోర్టుకు వెళ్ళే అంశంపై న్యాయవాదులతో చర్చిస్తున్నామన్నారు. రైతుభరోసాపై ప్రభుత్వం చేతులెత్తేసిందనన్నారు. 12 వేల రైతు భరోసాతో రేవంత్ సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ప్రభుత్వం తీరు బాలేదు కాబట్టే.. న్యాయవాదితో వస్తానని కేటీఆర్ అన్నారని తెలిపారు. రేసుతో అవినీతే జరగలేదని.. కేటీఆర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచారని చెప్పుకొచ్చారు. కంపెనీ ప్రతినిధులు కలిసిన విషయాన్ని సీఎం ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు.
కేవలంకుట్రతోనే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా రేసు కావాలని కోరారన్నారు. కేసీఆర్ పదేళ్ళ కాలంలో తెలంగాణను అగ్రభాగంలో నిలిపారని తెలిపారు. డబ్బు కట్టలతో రెడ్ హ్యాండెడ్‌గా దొరకిన వ్యక్తి రేవంత్ అని మండిపడ్డారు. కేటీఆర్ కేసుకు.. రేవంత్ కేసుకు తేడా ఉందన్నారు. గ్రీన్ కోకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదని మాజీ మంత్రి హరీష్‌రావు(Harish Rao) స్పష్టం చేశారు.
Also Read : Minister Komatireddy : ఆ టెండర్ల గందరగోళంపై మంత్రి సంచలన వ్యాఖ్యలు