MLA Harish Rao : తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను కలిసిన హరీష్ రావు
అయితే సీబీఐ కేసులో శుక్రవారంతో రిమాండ్ ముగిసింది...
MLA Harish Rao : బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు(MLA Harish Rao) ఢిల్లీలో పర్యటించారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఆయన కలిశారు. ములాఖత్ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని కవితకు సూచించారు.
MLA Harish Rao Meet
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ కేసులో శుక్రవారం (జూన్ 21) కోర్టు రిమాండ్‌ను జూలై 5 వరకు పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో మార్చి 15న ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెను మార్చి 16 రిమాండ్‌కు తరలించారు. 10 రోజుల ఈడీ కస్టడీ తర్వాత కవితను తిహార్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి జైలులో ఉన్న కవితను ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది.ఈడీ కేసులో జూలై 3 వరకు జ్యుడీషియల్ రిమాండ్ కొనసాగనుంది.అయితే సీబీఐ కేసులో శుక్రవారంతో రిమాండ్ ముగిసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జైలు అధికారులు కవితను రౌస్ అవెన్యూ కోర్టులో వర్చువల్ మోడ్‌లో హాజరుపరిచారు. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.
Also Read : Telangana Congress : జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జీవన్ రెడ్డిల మధ్య ఫ్లెక్సీల గోల