MLA Harish Rao : ఆ సొమ్మును అన్ని జిల్లాల ఉద్యోగులకు అందించండి

కాంగ్రెస్​ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రజలకు శాపంగా మారుతోందని హరీశ్ రావు విరుచుకుపడ్డారు...

MLA Harish Rao : పోలీసులకు సరెండర్, అడిషనల్ సరెండర్ లీవ్ బెనిఫిట్ కింద అందించే డబ్బులు అన్ని జిల్లాల ఉద్యోగులకు విడుదల చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(MLA Harish Rao) రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్కమార్కను డిమాండ్ చేశారు. ఆ నిధులను కొన్ని జిల్లాలకే విడుదల చేయడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ అకౌంట్లో ఓ పోస్ట్ చేశారు.

MLA Harish Rao Comment

“రాష్ట్రంలోని పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగులకు సరెండర్, అడిషనల్ సరెండర్ లీవ్ బెనిఫిట్ కింద అందించే డబ్బులు కొన్ని జిల్లాలకు మాత్రమే అందించి మరికొన్ని జిల్లాలకు అందించకపోవడం బాధాకరం. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి సిద్దిపేట్‌లోని దాదాపు 6వేల మంది కానిస్టేబుల్‌ల సరెండర్, అడిషనల్ సరెండర్ లీవ్ బెనిఫిట్ గత ఎనిమిది నెలలుగా పెండింగ్లో పెట్టారు. పెట్రోల్, డీజిల్ బిల్లులు కూడా నెలల తరబడి చెల్లించకపోవడంతో పోలీసులు, పెట్రోల్ బంక్ యాజమాన్యం ఇబ్బందులు పడుతున్నారు. వీరి పట్ల ఎందుకంత వివక్ష.? రాష్ట్ర పోలీసులలో వీళ్ళు భాగం కాదా..? ఒకే డిపార్ట్మెంట్లో ఇంత పక్షపాతం ఎందుకు .? ఈ చర్యలు ముమ్మాటికీ వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే. యూనిఫామ్ సర్వీస్ వాళ్లు కాబట్టి వాళ్లు బయటకు వచ్చి నిరసన తెలపలేకపోతున్నారు. వాళ్ళ సమస్యను నేను మీ దృష్టికి తెస్తున్నాను తక్షణమే పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా”అని హరీశ్ తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

కాంగ్రెస్​ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రజలకు శాపంగా మారుతోందని హరీశ్ రావు(MLA Harish Rao) విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో డెంగీ, మలేరియా, గన్యా వంటి విషజ్వరాల విజృంభిస్తాయని గతంలోనే తాము ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టు తెలిపారు. కానీ కాంగ్రెస్ తమ సూచనలను పెడచెవిన పెట్టిందని ధ్వజమెత్తారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసిందని.. దీంతో ప్రజలు అనారోగ్యంపాలవుతున్నారని అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం తక్షణమే వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ” రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్యం పడకేసింది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి పారిశుద్ధ్య నిర్వహణ, ఆసుపత్రుల సన్నద్ధత వంటి ముఖ్యమైన అంశాలపై తక్షణం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి వైరల్ ఫీవర్స్ బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా చూడాలి” అని డిమాండ్ చేశారు.

Also Read : YS Jagan Permission : విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన ఏపీ మాజీ సీఎం

Leave A Reply

Your Email Id will not be published!