MLA Harish Rao : కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీష్ రావు
తెలంగాణ నుంచి 8మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా....
Harish Rao : తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి మెండిచేయి చూపిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. గోదావరి పుష్కరాల నిధుల కేటాయింపు విషయంలో రాష్ట్రాన్ని ప్రధాని మోదీ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. మెుదట్నుంచీ కేంద్రానికి తెలంగాణ అంటే చిన్నచూపే అని హరీశ్ రావు(Harish Rao) అన్నారు. కేంద్ర ప్రభుత్వం గోదావరి పుష్కరాల వేడుకల నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్‌కు రూ.100 కోట్లు ఇచ్చిందని, తెలంగాణ రాష్ట్రానికి మాత్రం గుండు సున్నా మిగిల్చిందని హరీశ్ రావు ఫైర్ అయ్యారు.
తెలంగాణ నుంచి 8మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా.. ఒక్క రూపాయీ సాధించలేకపోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధుల కోసం పోరాటం చేయడంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎంపీలూ నిధుల కేటాయింపుపై మాట్లాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే లోక్‌సభలో బీఆర్‌ఎస్ ఉంటే రాష్ట్రానికి అన్యాయం జరిగేది కాదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లోనూ తెలంగాణకు సున్నా కేటాయింపులు చేశారని హరీశ్ రావు ధ్వజమెత్తారు. ఆ సమయంలోనూ తెలంగాణ ఎంపీలు నోరు మెదపలేకపోయారని ఆయన ఆగ్రహించారు.
Harish Rao Slams
ఆంధ్రప్రదేశ్‌కు అడిషనల్ గ్రాంట్ కింద రూ.15,000 కోట్లను ప్రధాని మోదీ ప్రభుత్వం ఇచ్చిందని, కానీ తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేశారని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి ఇచ్చారని తమకు బాధలేదని, కానీ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందనేదే తమ ఆవేదన అని చెప్పుకొచ్చారు. నిధుల కేటాయింపులో కేంద్రం మొదట్నుంచీ తెలంగాణకు మొండి చెయ్యే చూపిస్తోందని హరీశ్ రావు(Harish Rao) ధ్వజమెత్తారు. తమ రాష్ట్రం పట్ల ఇంత వివక్ష ఎందుకంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. తెలంగాణను ఇతర రాష్ట్రాలతో సమానంగా చూడాలని, హక్కుగా రావాల్సిన నిధులను కచ్చితంగా ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.
Also Read : AP Weather : ఏపీలో 5 రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు