MLA Harish Rao : ఆ ఎమ్మెల్యేలను మాజీలను చేసే వరకు వదిలిపెట్టేది లేదు

పార్టీ మారిన ఎమ్మెల్యేలను మాజీలు చేసే వరకు నిద్రపోమని స్పష్టం చేశారు...

MLA Harish Rao : జిల్లాలోని ఆర్‌సీపురంలో బీఆర్‌ఎస్ నేతలతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు(MLA Harish Rao) బుధవారం సమావేశమయ్యారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారిన నేపథ్యంలో సమావేశం నిర్వహించగా.. భారీగా పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. ఈ సంద్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ…వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలను తీసుకున్నారని… పార్టీ అయిపోయింది అన్నారని.. కానీ అన్నవాళ్లే కాలగర్భంలో కలిసిపోయారని అన్నారు. మహిపాల్ రెడ్డికి పార్టీ ఎం తక్కువ చేసిందని కాంగ్రెస్‌లోకి వెళ్లారని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు కష్టాలు వస్తాయన్నారు. ‘‘ పఠాన్ చెరుకు ఏం తక్కువ చేసినం… ఏది అడిగితే అది మంజూరు చేసాము.. నిధుల వరద పారించాం’’ అని మాజీ మంత్రి చెప్పుకొచ్చారు.

MLA Harish Rao Comment

పార్టీ మారిన ఎమ్మెల్యేలను మాజీలు చేసే వరకు నిద్రపోమని స్పష్టం చేశారు. మహిపాల్ రెడ్డికి పార్టీ మారడానికి మనసు ఎలా వచ్చిందని అడిగారు. గూడెం పార్టీ మారినా బీఆర్‌ఎస్ శ్రేణులు గుండె ధైర్యం కోల్పోవద్దని అన్నారు. నియోజకవర్గ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టాలని రేవంత్ గతంలో అన్నారని… ఇప్పుడు మాత్రం ఆయనే ఇళ్లకు వెళ్లి ఎమ్మెల్యేలకు కండువాలు కప్పుతున్నారని విమర్శించారు. రుణమాఫీపై జీవోను వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. మాటల్లోనేమో పాస్ బుక్ ప్రకారం రుణమాఫీ అని సీఎం రేవంత్ అంటున్నారని… కానీ జీవోల్లో మాత్రం తెల్ల రేషన్ కార్డ్ నిబంధన అని ఇచ్చారని తెలిపారు. రుణమాఫీలో పీఎం కిసాన్, రేషన్ కార్డు నిబంధనతో ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ అందరికి రుణమాఫీ చేశారని… ఇప్పుడు అలాగే చేయాలని డిమాండ్ మాజీ మంత్రి డిమాండ్ చేశారు.

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్‌ఎస్ కచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీల్లో ఎన్ని అమలు చేశారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీ ఒక్కటి అమలు చేయలేదన్నారు. కళ్యానలక్ష్మి చెక్కులు ఏడు నెలలుగా ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో బస్సు తప్ప అన్ని తుస్సే అంటూ ఎద్దేవా చేశారు. హామీలపై త్వరలోనే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం వెంట పడతారన్నారు. మంచి, చెడు ప్రజలు త్వరలోనే గుర్తిస్తారన్నారు. ప్రభుత్వ తప్పులపై పోరాడతామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై త్వరలో సుప్రీంకోర్టుకు వెళతామన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట ఉప ఎన్నికలు తప్పవని… ఉప ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్‌‌దే అని హరీష్ రావు(MLA Harish Rao) ధీమా వ్యక్తం చేశారు.

Also Read : Phone Tapping Case : జూబ్లీహిల్స్ పోలీసుల కస్టడీలో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ

Leave A Reply

Your Email Id will not be published!