MLA Jagga Reddy : తెలంగాణలో జిమ్మిక్కులు పని చేయవు
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి కామెంట్స్
MLA Jagga Reddy : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేశారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా ఇంకెన్ని వ్యూహాలు రూపొందించినా రాష్ట్రంలో వర్కవుట్ కాదన్నారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుందన్నారు. బీజేపీకి అంత సీన్ లేదన్నారు జగ్గారెడ్డి. అంతే కాదు ఇటీవలి కాలంలో తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ గురించి చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
రాష్ట్రం కోసం పని చేయాల్సిన రాజ్ భవన్ రాజకీయాలకు కేరాఫ్ గా మారిందన్నారు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ , కేంద్రంలో కొలువు తీరిన మోదీ సర్కార్ నాటకాలు ఆడుతున్నాయంటూ ఆరోపించారు.
ఢిల్లీలో తిట్టుకోవడంలో గల్లీలో దోస్తీ చేయడం షరా మామూలుగా మారిందంటూ ఎద్దేవా చేశారు జగ్గా రెడ్డి(MLA Jagga Reddy) . ఆరు నూరైనా తలకిందులుగా తపస్సు చేసినా బీజేపీ పవర్ లోకి రాదని జోష్యం చెప్పారు. దేశంలో బీజేపీయేతర రాష్ట్రాలలో గవర్నర్ , సీఎంల పంచాయతీ కొనసాగుతోందన్నారు జగ్గా రెడ్డి.
సీఎం కేసీఆర్ ను తిడితే ఏం వస్తుందని ప్రశ్నించారు. కనీసం ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే కొంతలో కొంతైనా పరిష్కారం లభిస్తుందని చెప్పారు. తాను ఏ తప్పు చేయనని ఎవరికీ తలవంచనని స్పష్టం చేశారు సంగారెడ్డి ఎమ్మెల్యే.
నిత్యం ప్రజల మధ్యనే ఉంటానని అందుకే జనం తనకు బ్రహ్మరథం పడుతున్నారంటూ పేర్కొన్నారు జగ్గారెడ్డి. వీఆర్ఏ, ఐకేపీ సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని , యాదగిరిగుట్ట పునర్ నిర్మాణం మంచిదేనని సీఎంకు కితాబు ఇచ్చారు. అక్కడి దాకా మెట్రో వేస్తే బాగుంటుందని సూచించారు.
Also Read : ప్రధానులు మారినా కష్టాలు తప్పలేదు