MLA Kaushik Reddy : కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి మధ్య వేడెక్కుతున్న మాటల యుద్ధం

గాంధీ ఇంటికి బయలుదేరుతా అనగానే తన ఇంటి చుట్టూ కంచెలు వేశారని కౌశిక్ రెడ్డి విమర్శించారు...

MLA Kaushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మధ్య వ్యవహారం మరింత హీటెక్కుతోంది. ఒకరి ఇంటికి మరొకరు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అరికపూడి గాంధీపై మండిపడ్డారు. ‘ బ్రోకర్‌వి నువ్వా నేనా.. టీడీపీలో గెలిచి బాబును మోసం చేశావు.. బీఆర్ఎస్‌లో గెలిచి కేసీఆర్‌ను మోసం చేశావు’ అని నిందించారు. ‘ మిస్టర్ గాంధీ గుర్తు పెట్టుకో.. సీఎం అవుతానని చెప్పుకున్న ఈటెలను బొంద పెట్టిన మగాణ్ణి నేను.. తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డను’’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ‘ ఎక్కడ నుంచో వచ్చి నాకు సవాల్ చేస్తే ఊరుకుంటనా?’ అంటూ కౌశిక్ రెడ్డి(MLA Kaushik Reddy) మండిపడ్డారు.

రేపు ఉదయం 11గంటలకు మా మేడ్చల్ జిల్లా అధ్యక్షుని నాయకత్వంలో గాంధీ ఇంటికి వెళతామని కౌశిక్ రెడ్డి తెలిపారు. జిల్లా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అంతా రావాలని పిలుపునిస్తున్నానన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అనుమతితో చెబుతున్నానన్నారు. ‘ నీకు నాకు ఏమైనా తగాదాలు ఉన్నాయా? నీకు నాకు ఏం పంచాయితీ? బీఆర్ఎస్ బి ఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లడానికి సిగ్గు అనిపించడం లేదా?’ అని ప్రశ్నించారు. మగాడివి ఐతే రాజీనామా చేసి మళ్లీ గెలువాలంటూ కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. అక్కడే మీ బలం, మా బలం ఏంటో తేల్చుకుందామన్నారు. అప్పుడు మొనగాడివి అని ఒప్పుకుంటానని కౌశిక్ రెడ్డి(MLA Kaushik Reddy) అన్నారు. బీఆర్ఎస్‌లో ఉంటే తెలంగాణ భవన్‌కు రావాలంటూ పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు.

MLA Kaushik Reddy Comment

గాంధీ ఇంటికి బయలుదేరుతా అనగానే తన ఇంటి చుట్టూ కంచెలు వేశారని కౌశిక్ రెడ్డి(MLA Kaushik Reddy) విమర్శించారు. తనను ముందస్తుగా అరెస్ట్ చేశారన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు తాను కూడా గాంధీకి సహచర ఎమ్మెలేనేనని అన్నారు. ఇద్దరం ఒకే పార్టీలో ఉంటే ఇద్దరం కలిసి బీఆర్‌ఎస్ భవన్‌కు వెళతామన్నానని.. దానికి గాంధీ ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ మారనప్పుడు బీఆర్ఎస్ పార్టీ జెండా పెట్టుకోవడానికి ఎందుకు అభ్యంతరం? అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీలో చేరానన్నది మీరే కదా? అని ప్రశ్నించారు. అలాంటప్పుడు మీకెందుకు అంత భయం అవుతుందని నిలదీశారు. ‘ బ్రోకర్ కౌశిక్ రెడ్డి బ్రోకర్ అన్నావు కదా.. నీవా బ్రోకర్.. నేనా?’ అని ప్రశ్నించారు.

చంద్రబాబును, కేసీఆర్‌ను అందరినీ మోసం చేసావన్నారు. ‘ నువ్వు ముసలోడివి నేను యంగ్’ అంటూ కౌశిక్ రెడ్డి కవ్వింపు చర్యలకు దిగారు. ఈటెల రాజేందర్ ను 100 కిలో మీటర్ల లోపల పాతిపెట్టి బీఆర్‌ఎస్ జెండా ఎగురవేశానన్నారు. రేపు ఉదయం 11 గంటలకు శాంబీపూర్ రాజు ఇంటి నుండి బయలుదేరి గాంధీ ఇంటికి వెళ్తామని.. జీహెచ్ఎంసీలోని ప్రతీ బీఆర్ ఎస్ కార్యకర్త గాంధీ ఇంటికి వెళ్లి అక్కడే టిఫిన్ చేద్దామంటూ పిలుపునిచ్చారు. గాంధీని బీఆర్ ఎస్ భవన్ కు తీసుకువెళ్లి అక్కడే ప్రెస్‌మీట్ పెడతామన్నారు.

Also Read : Karnataka News : కర్ణాటకలోని మాండ్య జిల్లాలో మత ఘర్షణలకు తీవ్రకళకలం

Leave A Reply

Your Email Id will not be published!