MLA Kolikapudi Srinivasarao: రమేశ్‌రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే పార్టీకు రాజీనామా చేస్తా – ఎమ్మెల్యే కొలికపూడి

రమేశ్‌రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే పార్టీకు రాజీనామా చేస్తా - ఎమ్మెల్యే కొలికపూడి

Kolikapudi Srinivasarao : తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు… తెలుగుదేశం పార్టీకు స్వపక్షంలో విపక్షంలా తయారయ్యారు. విద్యావంతుడు, మేధావి, అమరావతి రైతుల తరపున పోరాటం చేసినందుకు కొలికపూడి శ్రీనివాసరావును పార్టీలోనికి తీసుకువచ్చి… తిరువూరు అసెంబ్లీ స్థానం నుండి గెలిపించారు. అయితే కొలికపూడి(Kolikapudi Srinivasarao) అధికారంలోనికి వచ్చిన నాటి నుండి అతని వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు పార్టీ అధిష్టానం క్లాస్ పీకింది. తాజాగా మరోసారి కొలికపూడి శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. గిరిజన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ టీడీపీ నేత రమేశ్ రెడ్డిపై అధిష్టానం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో తాను పార్టీకు రాజీనామా చేస్తానని హెచ్చరించారు.

Kolikapudi Srinivasarao Comment

ఇటీవల ఓ గిరిజన మహిళపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనితో ఆ గిరిజన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ… గిరిజన మహిళలు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ లైంగిక వేధింపుల ఘటనపై ఎమ్మెల్యే కొలికపూడి స్పందిస్తూ… రమేశ్‌రెడ్డి వ్యవహారాన్ని పది రోజుల క్రితమే పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. 48 గంటల్లోగా ఆయనపై చర్యలు తీసుకోవాలని అధినాయకత్వాన్ని కోరారు. లేనిపక్షంలో బాధితులకు న్యాయం జరగకపోతే ఎమ్మెల్యేగా తానెందుకని… రాజీనామా చేస్తానని వ్యాఖ్యానించారు.

Also Read : Bhadrachalam: భద్రాచలంలో కూలిన ఐదంతస్తుల భవనం ! కొనసాగుతున్న సహాయక చర్యలు !

Leave A Reply

Your Email Id will not be published!