MLA Koona Ravi : ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయడం తమ్మినేనికి అలవాటే

తమ్మినేని సీతారాం ఇతర ఆస్తుల పైనా ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేశారని విమర్శలు చేశారు...

MLA Koona Ravi : ఆంధ్రప్రదేశ్ మాజీ అసెంబ్లీ స్పీకర్ వైసీపీ నేత తమ్మినేని సీతారాంపై తెలుగుదేశం పార్టీ ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్(MLA Koona Ravi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్లే కాదు.. ఆస్తులకూ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడం తమ్మినేనికి అలవాటేనని ఆరోపణలు చేశారు. తమ్మినేని అక్రమాలపై దర్యాప్తు కోసం స్పెషల్ టీం వేయాలని సీఎంను కోరతానని అన్నారు. సీతారాంకు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడం అలవాటేనని ఆరోపించారు. ఆ అలవాటులో భాగంగానే తమ్మినేని ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ తెచ్చుకున్నారని ఆరోపించారు.

తమ్మినేని సీతారాం ఇతర ఆస్తుల పైనా ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేశారని విమర్శలు చేశారు. సుమారు 17 ఆస్తులపై డమ్మాబుస్సుల సీతారాంఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారని ఎద్దేవా చేశారు. శ్రీకాకుళంలోనూ వివిధ కోర్టుల్లోనూ సీతారాంపై ఫేక్ డాక్యుమెంట్ల కేసులు నడుస్తున్నాయని ఆరోపించారు. ఇసుక తవ్వకాల్లోనూ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శలు చేశారు. నఖిలీ మిషన్ల ద్వారా తమ్మినేని(Tammineni) ఫేక్ ఓచర్లు పుట్టించారని, నఖిలీ మిషన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని ఆరోపించారు. ఇసుక అక్రమాలపై ఇప్పటికే ఫిర్యాదు చేశానని అన్నారు. డమ్మాబుస్సుల సీతారాంపై నేరాలు -ఘెరాలు అనే ఎపిసోడ్ తీయొచ్చని చెప్పారు. రెవెన్యూ సదస్సుల్లో సీతారాం ఫేక్ రెవెన్యూ డాక్యుమెంట్లపై ఫిర్యాదులు వస్తే వాటి మీద చర్యలు తీసుకుంటామని కూన రవి కుమార్ స్పష్టం చేశారు.

MLA Koona Ravi Comment

తమ్మినేని సీతారాం అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తమ్మినేని సీతారాం ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ తెచ్చుకున్నారని ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వంలోనే నాటి స్పీకర్ తమ్మినేని(Tammineni) ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ ద్వారా లా అడ్మిషన్ తీసుకున్నారని విమర్శలు చేశారు. నాటి సీఎం జగన్ దీన్ని పట్టించుకోలేదని చెప్పారు. డిగ్రీ చేసినట్టు అంబేద్కర్ యూనివర్శిటీ పేరుతో ఫేక్ సర్టిఫికెట్ తెచ్చారని విమర్శించారు. ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని ఓలా కాలేజీ నుంచి అడ్మిషన్ తీసుకున్నారన్నారు.

తమ్మినేని ఫేక్ వ్యవహారాన్ని అంబేద్కర్, ఉస్మానియా యూనివర్శిటీలు రెండూ ధ్రువీకరించాయని అన్నారు. తమ్మినేని ఫేక్ వ్యవహరంపై రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేశానని తెలిపారు. తమ్మినేని మీద సీఎస్ కు ఫిర్యాదు చేయాలని రాష్ట్రపతి కార్యాలయం నుంచి తనకు సమాచారం అందిందని అన్నారు. ఈ మేరకు సీఐడీతో విచారణ చేయించాలని సీఎస్‌కు ఫిర్యాదు చేశానని అన్నారు. తమ్మినేని ఫేక్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అంశం.. అందుకే సీఐడీతో విచారణ జరిపించాల్సి ఉంటుందని అన్నారు. త్వరలోనే సీఐడీ చీఫ్ అయ్యన్నార్‌ను కలిసి ఫిర్యాదు చేస్తానని అన్నారు. స్పీకర్‌గా వ్యవహరించిన వ్యక్తి ఫేక్ డాక్యుమెంట్ సృష్టిస్తే ఊపేక్షించకూడదని అన్నారు. సీఎస్, సీఐడీ విచారణ చేపట్టకుంటే న్యాయస్ఖానాన్ని ఆశ్రయిస్తానని ఎమ్మెల్యే కూన రవికుమార్ వెల్లడించారు.

Also Read : Deputy CM DK : మేము మా ఎమ్మెల్యేలతో సహా సీఎంకు అండగా ఉంటాం..

Leave A Reply

Your Email Id will not be published!