MLA KTR : రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన మాజీ మంత్రి

రైతుబంధుపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చెప్పాలని అన్నారు...

KTR : రైతు రుణమాఫీ వందశాతం పూర్తి అయినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) సవాల్ విసిరారు. రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్ చేశారు.కొండారెడ్డి పల్లి, పాలేరు ఎక్కడికైనా వెళ్దామని ఛాలెంజ్ చేశారు.ఈరోజు అసెంబ్లీలో రుణమాఫీపై చర్చ జరిగింది. దీనిపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.రైతులను అడుగుదామని అన్నారు. వంద శాతం రుణమాఫీ అయినట్లు నిరూపించాలని కేటీఆర్ అన్నారు. రైతుబంధుపై సమగ్ర చర్చ జరగాలని కేటీఆర్ అన్నారు. రైతు భరోసాను ప్రారంభించింది తామేనని స్పష్టం చేశారు.రైతుబంధుతోనే సాగు విస్తీర్ణం పెరిగిందని గుర్తుచేశారు. రైతుబంధుపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చెప్పాలని అన్నారు. రైతుబంధు ఒక పంటకు ఇస్తారో లేక..రెండు పంటలకు ఇస్తారో ప్రభుత్వం చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్ చేశారు.

MLA KTR Challenges

శాసనసభ పది నిమిషాల ఆలస్యంగా ప్రారంభం కావటంపై మాజీ మంత్రి హారీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు.10గంలకు ప్రారంభంకావాల్సిన సభ.. 10.10గంకు ఎందుకు ప్రారంభం అయిందని ప్రశ్నించారు. సభను సమయానికి ఎందుకు నడపడం లేదని హరీష్‌రావు నిలదీశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లు సభను సమయానికి నడిపామని హరీష్‌రావు గుర్తుచేశారు. చట్టాలు చేసే మనం ఆదర్శంగా ఉండాలని హరీష్‌రావు చెప్పారు. సభను సమయానికి ప్రారంభించాలని అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు విజ్ఞప్తి చేశారు.

Also Read : PM Narendra Modi : రెండు రోజులు కువైట్ లో పర్యటించనున్న ప్రధాని మోదీ

Leave A Reply

Your Email Id will not be published!