MLA KTR : జానపద గాయకుడు మొగిలయ్య మృతిపై సంతాపం తెలిపిన కేటీఆర్
జానపద గాయకుడు మొగులయ్యా ఈరోజు (గురువారం) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు...
KTR : బలగం మొగులయ్య మృతి పట్ల మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం తెలిపారు. ఎక్స్ వేదికగా మాజీ మంత్రి స్పందించారు. మొగులయ్య చనిపోయినా పాటల రూపంలో బతికే ఉన్నారన్నారు. మొగులన్న పాట తెలంగాణ బలగాన్ని మళ్లీ చాటిందని.. మాయమైపోతున్న కుటుంబ బంధాలను మళ్లీ గుర్తు చేసిందని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. మొగులయ్య కుటుంబసభ్యులకు కేటీఆర్(KTR) ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
MLA KTR Twitter
జానపద గాయకుడు మొగులయ్యా ఈరోజు (గురువారం) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కిడ్నీ ఫెయిల్ అయి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వరంగల్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. పరిస్థితి విషమించడంతో మరణించారు. బలగం సినిమాలో ఆయన పాడిన ‘‘ తోడుగా నాతోడుంటూ’’ పాట ఎంతటి ఆదరణను పొందిందో అందరికీ తెలిసిందే. ఆ పాటతో మొగులయ్య చాలా ఫేమస్ అయ్యారు. ఆ తరవాత కొన్నాళ్లకు మొగులయ్య తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. విషయం తెలిసిన తెలంగాణ ప్రభుత్వం ఆయనను ఆదుకుంది. అలాగే బలగం డైరెక్టర్ వేణు, మెగాస్టార్ చిరంజీవి కూడా మొగులయ్యకు ఆర్థిక సాయం అందజేశారు. కొద్ది రోజుల పాటు హైదరాబాద్లో ఉండి చికిత్స పొందారు మొగులయ్యారు. కిడ్నా సంబంధిత వ్యాధితో ప్రతీ రోజు మొగులయ్య డయాలసిస్ చేయించుకున్నారు. ఆ తరువాత తీవ్ర అనారోగ్యంతో వరంగల్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మొగులయ్యా ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో కన్నుమూశారు.
Also Read : Priyanka Gandhi : జమిలి ఎన్నికల జేపీసీ కమిటీలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ