MLA KTR : కాశ్మీర్ ఎన్నికల్లో విజయం సాధించిన ‘ఒమర్ అబ్దుల్లా కు’ అభినందనలు

కాగా కర్ణాటకలో ఐదు, తెలంగాణలో ఆరు గ్యారెంటీలంటూ అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌....

KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా కాశ్మీర్ ఎన్నికల్లో విజయం సాధించిన ఓమర్ అబ్దుల్లా(Omar Abdullah) కు అభినందనలు తెలిపారు. అద్భుతమైన పునరాగమనం చేశారంటూ.. కితాబు ఇచ్చారు. ‘ వారు చెప్పినట్లు, మీరు మీ పునరాగమనం ఎదురుదెబ్బ కంటే మెరుగ్గా ఉండేలా చూసుకున్నారు.. భారతదేశంలోని అత్యంత అందమైన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నందుకు శుభాకాంక్షలు’ అంటూ కేటీఆర్(KTR) పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేటీఆర్(KTR) ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. ‘‘ రాహుల్ జీ, యువతకు ఇచ్చిన హామీలు అమలు చేసినందుకు ధన్యవాదములు.. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అందించినందుకు ధన్యవాదాలు చెప్పటానికి అశోక్ నగర్ యువత వేచి ఉన్నారు.. TSPSC (టీఎస్పీఎస్సీ) 5 లక్షల “యువ వికాసం” సహాయం, పునరుద్ధరణకు కూడా ధన్యవాదాలు.. మీ హామీ పూర్తయినందున యువకులను కలవడానికి తిరిగి హైదరాబాద్‌కు రావడానికి స్వాగతం’’ అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు.

KTR Congratulates..

కాగా కర్ణాటకలో ఐదు, తెలంగాణలో ఆరు గ్యారెంటీలంటూ అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌(Congress).. హరియాణలో ఏడు గ్యారెంటీలని మభ్యపెట్టే ప్రయత్నాన్ని ఆ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) అన్నారు. హామీల అమలులో కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చేస్తున్న మోసాన్ని దేశం మొత్తం గమనిస్తోందనడానికి ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒక్కో రాష్ట్ర ఎన్నికల్లో ఒక్కో గ్యారెంటీ పెంచుకుంటూ గారడీ చేద్దామని చూసిన కాంగ్రెస్‌ బొక్కబోర్లా పడిందని ఎద్దేవా చేశారు. హరియాణలో కాంగ్రెస్‌ ఓటమితోనైనా రాహుల్‌ గాంధీ బుద్ధి తెచ్చుకోవాలని, చెప్పేమాటలకు చేస్తున్న పనులకు పొంతన లేనప్పుడు ఇలాంటి చెంపపెట్టులాంటి ఫలితాలు తప్పవన్నారు.

బుల్డోజర్‌రాజ్‌, పార్టీ ఫిరాయింపులు, రాజ్యాంగ పరిరక్షణ పేరుతో ఆయన చేసిన డ్రామాలకు హరియాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన ఈ రోజుల్లో రాష్ట్రాలు వేరైనా ప్రజల నుంచి వాస్తవాలు దాచడం సాధ్యంకాదన్నారు. కాంగ్రె్‌సతో హోరాహోరీ ఉన్న రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుస్తోందని, ఆ పార్టీ ఓటమికి రాహుల్‌గాంధీ బలహీన నాయకత్వంకూడా ఓ ప్రధాన కారణమన్నారు.

బీజేపీని ఢీకొని నిలువరించే శక్తి కేవలం ప్రాంతీయ పార్టీలకు మాత్రమే ఉందన్న విషయం ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నిక లను చూస్తే అర్థమైపోతుందని తెలిపారు. . మరోవైపు.. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే చిరుద్యోగులు వేతనాలు రాక విలవిలలాడుతున్నారని, ఈ దండగమారి పాలనలో పండుగపూట వారంతా పస్తులు ఉండాల్సిందేనా? అని కేటీఆర్‌ ‘ఎక్స్‌’ వేదికగా ప్రశ్నించారు. కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి ఐదారునెలలుగా జీతాల్లేవని, పంచాయతీ వర్కర్లు, మునిసిపాలిటీ కార్మికులు, ఆస్పత్రి సిబ్బంది, హాస్టల్‌ వర్కర్లు, గెస్ట్‌ లెక్చరర్లు.. ఇలా ప్రతీశాఖలో వేతనాల పెండింగ్‌ ఉందన్నారు. ఆయా ఉద్యోగులు తమ కుటుంబాలను నెట్టుకురావడానికి అప్పులుచేసి తిప్పలు పడుతున్నారని పేర్కొన్నారు. ఒకటో తేదీనే జీతాలిస్తామన్న మీ ప్రగల్భాలు ఏమయ్యాయని నిలదీశారు. ఉద్యోగగుల అవస్థను గుర్తించి తక్షణం వేతనాలు చెల్లించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

Also Read : MLA Sabitha Indra Reddy : రాబోయే రోజుల్లో కార్తీకరెడ్డికి కూడా అండగా నిలిచి దివిస్తారని కోరుతున్న

Leave A Reply

Your Email Id will not be published!