MLA KTR : ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం
మండలానికి ఒక గ్రామంలోనే మీ గ్యారెంటీ కార్డులు ఇచ్చారా...
KTR : తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నల వర్షం కురిపించారు. ఆరుగ్యారెంటీలను పూర్తిగా అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మభ్య పెడుతున్నారని విమర్శించారు. సోషల్ మీడియా (ఎక్స్) వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్(KTR) ప్రశ్నలవర్షం కురిపించారు.
KTR Slams Congress
‘‘మండలానికి ఒక గ్రామంలోనే మీ కాంగ్రెస్ మ్యానిఫెస్టో పంచారా. మండలానికి ఒక గ్రామంలోనే మీ గ్యారెంటీ కార్డులు ఇచ్చారా. మండలానికి ఒక గ్రామంలోనే మీ ఎన్నికల ప్రచారం చేశారా. మండలానికి ఒక గ్రామంలోనే ప్రజలను ఓట్లేయమని అడిగారా. మండలానికి ఒక గ్రామంలోనే ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చారా. నాడు “అందరికీ అన్నీ..” అని.. నేడు “కొందరికే కొన్ని..” పేరిట మభ్యపెడితే నాలుగు కోట్ల తెలంగాణ మీ నయవంచనను క్షమించదు. ఎన్నికలప్పుడు రాష్ట్రంలోని ప్రతి మండలం ప్రతి గ్రామంలోని.. ప్రతి ఇంటా.. అబద్ధపు హామీలను ఊదరగొట్టి.. “వన్ ఇయర్” తరువాత “వన్ విలేజ్” అనడం ప్రజలకు వెన్నుపోటు పొడవడమే. ప్రతిపక్షంగా ఇంకో నాలుగేళ్లు.. ఓపిక పట్టడానికి మేము సిద్ధం కానీ ఏరు దాటక తెప్ప తగలేసే మీ ఏడాది దగా పాలన చూసిన తర్వాత అగడానికి ప్రజలు మాత్రం సిద్ధంగా లేరు. గుర్తుపెట్టుకోండి..”పథకాలు రాని గ్రామాల్లో..” రేపటి నుంచి.. “ప్రజా రణరంగమే..!!” అని కేటీఆర్ హెచ్చరించారు.
Also Read : DY Speaker RRR : కస్టోడియల్ టార్చర్ కేసులో సంచలన విషయాలు వెల్లడించిన ఆర్ఆర్ఆర్