MLA KTR : ఏడాది కాంగ్రెస్ పాలనలో రాష్ట్రమంతా అస్తవ్యస్తమయింది
నేడు సరైన దిశానిర్దేశం లేక విద్యార్థులు దీన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని తెలిపారు...
MLA KTR : కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(MLA KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తుకు గురుకులాలు ఎదిగాయని అన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తమై అధ్వాన్న స్థితికి చేరాయని విమర్శలు చేశారు.
MLA KTR Slams
నేడు సరైన దిశానిర్దేశం లేక విద్యార్థులు దీన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. నాడు గురుకులాల్లో సీటు కోసం విద్యార్థులు పోటీ పడ్డారని చెప్పారు. నేడు గురుకులం పేరు చెబితే విద్యార్థులు డీలా పడిపోతున్నారని అన్నారు. నాడు కడుపునిండా అన్నం తిని-అనుకున్న లక్ష్యాలను సాధిస్తే…నేడు అన్నమో రామచంద్ర అనే రోజులు వచ్చాయని చెప్పుకొచ్చారు. నాడు 41 వేల సీట్లకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష రాసేందుకు లక్ష 68 వేల దరఖాస్తులు వస్తే నేడు 51 వేల సీట్లకు గాను 80 వేల దరఖాస్తులే వచ్చాయన్నారు.
ఏడాది పాలనలో 50 కి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్, ఇతర కారణాలతో మరణించినా కాంగ్రెస్ సర్కారులో కనీస చలనం లేదని మండిపడ్డారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కనీస పరామర్శ లేకపోగా అంత్యక్రియలకు, పరామర్శకు వెళ్లే ప్రతిపక్షం మీద ఈ ప్రభుత్వం నిర్భందం ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు. ఈ సర్కారు నిర్లక్ష్యం తెలంగాణ భవిష్యత్తు అయిన భావితరాలకు శాపంగా మారిందని కేటీఆర్ విమర్శించారు.
Also Read : Donald Trump : ట్రంప్ ఉద్యోగ యంత్రాంగంలో భారీ ప్రక్షాళన..ఒకేసారి 9500 మంది తొలగింపు