MLA KTR Slams : స్వయంగా ముఖ్యమంత్రే తెలంగాణ పరువును గంగలో కలిపారు
కాంగ్రెస్ ప్రభుత్వంలో కోటీశ్వరులైన మహిళలను మాత్రమే రేవంత్ ఓట్లు అడగాలన్నారు...
KTR : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.సీఎం రేవంత్.. అచ్చోసిన ఆంబోతు మాదిరి రంకెలు వేయటం మానుకోవాలన్నారు. తెలంగాణ ఆర్థిక స్థితిపై అసెంబ్లీలో చర్చకు పెట్టాలని డిమాండ్ చేశారు.సభ సాక్షిగా నాలుగు కోట్ల ప్రజల ముందు సీఎం రేవంత్ బట్టలు విప్పుతామని హెచ్చరించారు. పాలన చేతకాని సన్యాసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విరుచుకుపడ్డారు. సొంత రాష్ట్రాన్ని క్యాన్సర్‌తో పోల్చిన భావదారిద్ర్యపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ దుయ్యబట్టారు.
KTR Slams
కాంగ్రెస్ ప్రభుత్వంలో కోటీశ్వరులైన మహిళలను మాత్రమే రేవంత్(CM Revanth Reddy) ఓట్లు అడగాలన్నారు. తెలంగాణ దివాలా తీసిందని.. గత 15 నెలలుగా కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. స్వయంగా ముఖ్యమంత్రి తెలంగాణ పరువును గంగలో కలుపుతున్నారన్నారు. కాళేశ్వరంపై కొంతమంది సన్యాసులు చెత్తవాగుడు బంద్ చేయాలని అన్నారు. తెలంగాణ ఆర్థికస్థితిపై ఫిబ్రవరి 17న డిప్యూటీ సీఎం భట్టి విడుదల చేసిన సమగ్రమైన నివేదికను రేవంత్ చదువుకోవాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలు చెప్పిన ఉప ముఖ్యమంత్రి భట్టికి ధన్యవాదాలు తెలియజేశారు.
సంపద సృష్టించటంలో కేసీఆర్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందన్నారు. రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం అంటూ వ్యాఖ్యలు చేశారు.సిగ్గు.. మానం లేని మూర్ఖపు ముఖ్యమంత్రి అని విమర్శించారు. కేసీఆర్‌ను దూషించటం మూనుకోకుంటే రేవంత్ మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. పాపం భట్టి విక్రమార్క అమాయకంగా ఇరుక్కున్నారని.. ఆయన ఉద్యోగం ఉంటదో.. పోతుందో? అని అనుమానం వ్యక్తం చేశారు.అప్పులకు వడ్డీ.. రేవంత్ 6వేల 500 కోట్లు అంటున్నారని.. భట్టి 2 వేల 200 కోట్లు అంటున్నారని తెలిపారు. ఢిల్లీ పార్టీలకు తెలంగాణను పరిపాలించుట చేదకాదని తేలిందన్నారు. కేంద్రం ఇచ్చే దానికంటే.. కేంద్రానికి పన్నుల రూపంలో తెలంగాణ ఇచ్చేది ఎక్కువ అని చెప్పుకొచ్చారు. ఒక్క హామీ కూడా అమలు చేయకుండా.. అప్పులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. హైడ్రాతో రేవంత్ రెడ్డి.. రియల్ ఎస్టేట్‌కు వెన్నుపోటు పోడిచారన్నారు. నీళ్ళు ఇచ్చుడు చేతకాకుంటే క్రాప్ హాలిడే ప్రకటించాలని మాజీమంత్రి డిమాండ్ చేశారు.
Also Read : Shivraj Singh Chauhan : ఎయిర్ ఇండియా విమాన సంస్థపై భగ్గుమన్న కేంద్రమంత్రి