MLA Madhavaram Krishna Rao : కాంగ్రెస్ నేతల వేధింపులతోనే బీఆర్ఎస్ నేత మృతి

పరోక్షంగా మున్సిపల్‌ అధికారులు కాంగ్రెస్‌ నాయకులకు సహాకారం అదిస్తున్నారన్నారు...

Madhavaram Krishna Rao : బోరబండలో 50గజాల్లో ఇళ్లు కట్టుకుంటున్న పేద కుటుంబానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు సర్దార్‌ కాంగ్రెస్‌ నాయకుల వేధింపులతోనే మృతి చెందాడని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Madhavaram Krishna Rao) ఆరోపించారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పక్క నియోజకవర్గంలోని అయ్యప్ప సొసైటీలో ఎలాంటి అనుమతులు లేకుండా 6 నుంచి 8 అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నా కళ్లుమూసుకున్న అధికారులు.

MLA Madhavaram Krishna Rao Slams

50 గజాల్లో అదనపు అంతస్తు వేసుకుంటే అక్రమ నిర్మాణమంటూ కూల్చడం ఎంతవరకు సబబని మున్సిపల్‌ అధికారులను ప్రశ్నించారు. బోరబండ మైనార్టీ నాయకుడు సర్దార్‌మృతికి కారుకులైన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సోమవారం నిర్వహించే ప్రజావాణి ప్రజల కోసం కాదని, కాంగ్రెస్‌ నాయకుల వసూళ్ల కోసమేనని విమర్శించారు. పరోక్షంగా మున్సిపల్‌ అధికారులు కాంగ్రెస్‌ నాయకులకు సహాకారం అదిస్తున్నారన్నారు. 18 నెలల కాంగ్రెస్‌ పాలనలో నగరంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదన్నారు.

ఫతేనగర్‌ బ్రిడ్జి పనులు పూర్తిచేయకుంటే సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‏యాదవ్‌తో కలిసి నిరాహార దీక్షకు దిగుతామని ఆయన హెచ్చరించారు. ఈ బ్రిడ్జి విస్తరణ కోసం బీఆర్‌ఎస్‌ హయంలోనే రూ.60 కోట్లు కేటాయించి రైల్వే అనుమతులు కూడా ఇప్పించినట్లు గుర్తుచేశారు. అల్లాపూర్‌ నుంచి దీన్‌దయాళ్‌నగర్‌కు నాలా విస్తరణకు తమ హయాంలోనే నిధులు మంజూరు చేసినా పనులు మాత్రం జరగడం లేదన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌లు, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Also Read : IPL 2025-Rohit Sharma : ఎలిమినేటర్ మ్యాచ్ లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో అదరగొట్టిన రోహిత్

Leave A Reply

Your Email Id will not be published!