MLA Madhavi Reddy : కడప కార్పొరేషన్ ను వైసీపీ నాశనం చేసింది
తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ....
Madhavi Reddy : కడప సమస్యల పరిష్కారానికి ఎంతవరకైనా పోరాడతామని, నీటి ఎద్దడి ఎక్కువగా ఉందని, నీటి సమస్య పరిష్కారానికి సంబంధిత మంత్రితో మా ట్లాడి పరిష్కరిస్తామని ఏపీ శాసనసభ విప్, కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి(Madhavi Reddy) స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఆదివారం కడపలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ కడప కార్పొరేషన్‌ను వైఎస్సార్సీపీ నిర్వీర్యం చేసిందని, సచివాలయంలో ఎవరి బాధ్య త ఏమిటో తెలియక పని చేస్తున్నారని విమర్శించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కడప జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని, ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామని శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించకుండా శంకుస్థాపనకే పరిమితం చేశారని ఆరోపించారు. టీడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని ఎమ్మెల్యే మాధవి రెడ్డి(Madhavi Reddy) విమర్శించారు.
MLA Madhavi Reddy Comments
తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు శాసనసభకు రానప్పుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వాళ్లను శాసనసభకు వెళ్లనీయకుండా జగన్ రెడ్డి అడ్డుకున్నారని ఆరోపించారు. శాసనసభలో ప్రతి అంశంపై చర్చ జరుగుతోందని, సూపర్ సిక్స్ పథకాలను దశల వారీగా తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. జన్మభూమి కార్యక్రమం త్వరలో ప్రారంభం కాబోతుందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పు పది లక్షల కోట్లని అన్నారు. ప్రతిపక్షాల విమర్శలను తాము పట్టించుకొమన్నారు. కడప జిల్లాలో ఇప్పటికే 1,20,000 టీడీపీ సభ్యత్వాలు జరిగాయన్నారు. అమ్మను చెల్లిని పట్టించుకోని నాయకుడు తమపై విమర్శ లు చేయడమేంటని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.
కాగా ఇటీవల కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వేదికపై మేయర్ పక్కన కూర్చో నివ్వకుండా కార్పొరేటర్లు కూర్చునే చోట కూర్చుకోవాలంటున్న పాలక వర్గ వైసీపీ నేతల తీరుపై కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి భగ్గుమన్నారు. కౌన్సిల్ సమావేశానికి తన అనుచరులు, టీడీపీ కార్యకర్తలను తీసుకొని ఆమె మునిసిపల్ కార్పొరేషన్‌కు వచ్చారు. అయితే నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేను మినహా మిగతా ఎవరినీ పోలీసులు లోపలికి అనుమతించలేదు. లోపలికి వెళ్లిన మాధవి రెడ్డి.. ఇన్నాళ్లు కుర్చి వేసి ఇప్పుడు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. కార్పొరేటర్లలో కూర్చోవాల్సిన అవసరం ఏముందని ఆమె నిలదీశారు. ఈ అంశంపై ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి.
కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి(Madhavi Reddy), మేయర్ సురేశ్ బాబు మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ తరుణంలో జరుగుతున్న కడప మునిసిపల్ కార్పొరేషన్ సమావేశంలో మేయర్ పక్కన ఎమ్మెల్యేను కూర్చోనివ్వకూడదని పాలక వైసీపీ వర్గం భావించింది. ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అలర్లు ఏమైనా జరుగుతాయేమో అనే ఉద్దేశంతో ఎస్పీకి ముందే ఫిర్యాదు వెళ్లింది. దీంతో పోలీసులు ముందస్తుగా భారీగా బలగాలను మోహరించారు. ఎలాంటి గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మాధవి రెడ్డి భారీ కాన్వాయ్‌తో వచ్చారు. ఆమెతో పాటు టీడీపీ శ్రేణులు కూడా రాగా వారిని పోలీసులు అడ్డుకున్నారు.
Also Read : Minister Kishan Reddy : రేవంత్ రెడ్డి సీఎంగా ఉండేది ఈ ఒక్క టర్మ్ మాత్రమే