MLA Mahipal Reddy : మైనింగ్ అక్రమాలపై ఈడీ ఎదుట ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
మహిపాల్ రెడ్డి సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ అనే కంపెనీని నడుపుతున్నారు...
MLA Mahipal Reddy : మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడ్డారంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై కేసు నమోదయింది.మంగళవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. మైపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మహిపాల్ ఇంట్లో కూడా అధికారులు రెండు రోజుల పాటు తనిఖీలు చేశారు. 300 కోట్ల వరకు ప్రభుత్వానికి నష్టం వచ్చే విధంగా చేశారని ఆరోపించారు.
MLA Mahipal Reddy ED Case
మైనింగ్ శాఖలో ప్రభుత్వానికి పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుడి ఇంట్లో వారం రోజుల క్రితం ఈడీ సోదాలు నిర్వహించింది. మహిపాల్ రెడ్డి సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ అనే కంపెనీని నడుపుతున్నారు. 39 కోట్ల మేర పన్నులు ఎగవేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్ ద్వారా వచ్చిన లాభాలన్నీ బినామీ పేర్లతో ఆస్తులు, కంపెనీల ద్వారా జమ చేశారన్నారు. సంగారెడ్డి పటాన్చెరు పరిసర ప్రాంతాల్లో మహిపాల్ సోదరులు మైనింగ్ చేస్తున్నట్లు సమాచారం.
Also Read : Rahul Gandhi : మోదీ ప్రపంచంలో వాస్తవాన్ని తొలగించవచ్చు మరి రియాలిటీ..!