MLA Sabitha Indra Reddy : ఆరు గ్యారంటీ లను పక్కన పెట్టేందుకు ఆడుతున్న ఆటే ఈ ‘హైడ్రా’
మిషన్ భగీరథ, శానిటేషన్ తదితర విషయాల్లో ప్రభుత్వం విఫలమైందన్నారు...
MLA Sabitha Indra Reddy : కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక, పక్కకు పెట్టడానికే హైడ్రాను తెరపైకి తెచ్చిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి(MLA Sabitha Indra Reddy) ప్రభుత్వంపై మండిపడ్డారు. శుక్రవారం మహేశ్వరంలో రైతు రుణమాఫీపై వ్యవసాయాఽధికారులతో నిర్వహించిన సమీక్ష అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడు తూ సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ప్రధానంగా రైతు రుణమాఫీ ఒకటని, దానిని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. రైతు రుణమాఫీ విషయంలో ఏ ఒక్క శాఖకు కూడా పూర్తిగా అవగాహన లేదని, రైతుల ఎవరిని అడగాలో తెలియక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి మాత్రం రైతు రుణమాఫీ రూ.31 వేల కోట్లు అని ప్రచారం చేసుకుంటున్నారని, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాత్రం రూ.7వేల కోట్లు మాఫీ చేశామని చెప్పుడం సిగ్గుచేటన్నారు. రైతు బంధును పక్కకుపెట్టి అరకొర రైతు రుణమాఫీ చేయడంతో రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
MLA Sabitha Indra Reddy Comment
అలాగే గ్రామపంచాయతీ వ్యవస్థను అస్తవ్యస్తం చేసి వాటి పాలనను గాలికొదిలేసి గ్రామాల్లో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనం చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉండడం బాధాకరమన్నారు. మిషన్ భగీరథ, శానిటేషన్ తదితర విషయాల్లో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఒక్క రైతులనే కాదు రాష్ట్రంలో విద్య, వైద్యం వంటి ప్రధాన శాఖలను కూడా ముఖ్యమంత్రి వీధులపాలు చేశాడన్నారు. అభివృద్ధిని పక్కకు పెట్టి హైడ్రా(HYDRA)ను తెరపైకి తెచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేందుకేనా ప్రజలు కాంగ్రె్‌సకు అధికారం కట్టబెట్టిందని ప్రశ్నించారు.
ఇప్పటివరకు ప్రజలను మోసం చేసింది చాలదన్నట్లు.. మళ్లీ రేషన్‌కార్డులు, హెల్త్ కార్డుల కోసం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చెప్పడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికీ ఏ ఒక్కరికీ గ్యాస్ సబ్సిడీ రాలేదని, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ తదితర సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఓ ఒక్క అభివృద్ధి పని మొదలు పెట్టలేదన్నారు. అసెంబ్లీ బడ్జెట్ మీటింగ్‌లో రాష్ట్రంలోని పరిస్థితులపై ముఖ్యమంత్రి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని సబితారెడ్డి అన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పాండుయాదవ్, సురేందర్‌రెడ్డి, నవీన్, ప్రభాకర్‌రెడ్డి, సుధీర్‌గౌడ్, సమీర్, కె.చంద్రయ్య, రాజునాయక్, కె. ప్రభాకర్, పి.బాలయ్య, ఆదిల్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : Rajya Sabha MP Resign: వైసీపీ కీ ఇద్దరు ఎంపీలు అవుట్ !