MLA Seethakka : హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీకి చెందిన ములుగు ఎమ్మెల్యే సీతక్క హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వం కావాలని ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారి పట్ల వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు శనివారం కోర్టును ఆశ్రయించారు సీతక్క.
తన ములుగు నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గ అభివృద్ది నిధులు (సీడీఎఫ్) విడుదల చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు ఎమ్మెల్యే. వెంటనే రిలీజ్ చేసేలా రాష్ట్ర సర్కార్ ను ఆదేశించాలని ఆమె కోరారు. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
MLA Seethakka Visit High Court
రాష్ట్రంలోనే అత్యధికంగా ఆదివాసీలు ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే అది ఒక్క ములుగు జిల్లానని, కానీ అలాంటి వారికి న్యాయ బద్దంగా, రాజ్యాంగ ప్రకారం రావాల్సిన నిధులను మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురి చేయడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.
జిల్లా సంక్షేమం గురించి పట్టించు కోకుండా , అప్రూవర్ అథారిటీగా ఉన్న రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్య వతి రాథోడ్ రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపించారు ములుగు ఎమ్మెల్యే సీతక్క(MLA Seethakka). ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారని, కానీ ఒక్క పైసా కూడా రాలేదన్నారు . మరోసారి నోటీసులు జారీ చేసి , సీడీఎఫ్ నిధులు ఇచ్చేలా చూడాలని కోరారు .
Also Read : RK Roja Selvamani : అవినీతికి మోత మోగించాలా