MLC Kavitha CM KCR : ఢిల్లీ మద్యం స్కాం ఏం చేద్దాం
సీఎం కేసీఆర్ తో కవిత భేటీ
MLC Kavitha CM KCR : దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు రోజు రోజుకు మలుపులు తిరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) పేరు ప్రధానంగా ఉండడం విస్తు పోయేలా చేసింది. తెలంగాణ జాగృతి సంస్థ ఫౌండర్ గా పేరొందారు. అనంతరం ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా ఎదిగారు. ఆపై కవిత ఎంపీగా గెలిచారు.
ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ వెంటనే తండ్రి కేసీఆర్ కూతురుకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఇదే సమయంలో ఊహించని రీతిలో ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో ఉన్నట్టుండి ఎమ్మెల్సీ కవిత పేరు బయట పెట్టింది కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించింది ఎమ్మెల్సీ కవిత.
కానీ సీబీఐ ఆమె చేసిన బండారాన్ని మొత్తం పూస గుచ్చినట్టు బయట పెట్టింది. వైసీపీ ఎంపీ , లిక్కర్ డాన్ గా పేరొందిన మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు అరబిందో ఫార్మా డైరెక్టర్ ఎంపీ విజయ సాయి రెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రా రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ కవిత కలిసి సౌత్ గ్రూప్ గా ఏర్పడ్డారని వెల్లడించింది.
ఈ కీలక కేసు పలు ప్రకంపనలు రేపింది. ఆమె రెండు నెంబర్లతో 11 ఫోన్లు వాడిందని, మొత్తం సమాచారం దొరకకుండా ధ్వంసం చేసిందని సీబీఐ ప్రకటించింది. కవిత(MLC Kavitha) ఎలా వీరితో కలిసి ముడుపులు చెల్లించిందని ఆరోపించింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తాను విచారణకు హాజరవుతానని తెలిపింది.
మొదట 6న ఓకే చెప్పింది. ఆ తర్వాత మాట మార్చింది. తన పేరు ఎఫ్ఐఆర్ లో లేదని చెప్పింది. కానీ సీబీఐ నోటీసు జారీ చేయడంతో దిగొచ్చింది. 11న 11.30 గంటల నుంచి 6.30 గంటల వరకు 7 గంటలకు పైగా విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది.
ఆమె కోలుకునే లోపే సీబీఐ షాక్ ఇచ్చింది. 91 సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చింది. దీంతో అవాక్కైయిన ఎమ్మెల్సీ కవిత ఏం చేయాలనే దానిపై హుటా హుటిన తన తండ్రి ఉంటున్న ప్రగతి భవన్ కు చేరుకుంది. అక్కడ సీఎం కేసీఆర్(CM KCR) తో ఏం చేయాలనే దానిపై చర్చించింది.
ఇందులో న్యాయ నిపుణులు, న్యాయవాదులు , ఇతర మేధావులు, పార్టీ పెద్దలు పాల్గొన్నారు. ఇదంతా రాజకీయ పూరితమైన కక్ష సాధింపు తప్ప మరొకటి కాదన్నారు టీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్.
Also Read : ఎమ్మెల్సీ కవితకు షాక్ సీబీఐ మరో నోటీసు