Moeen Ali : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతంగా ఆడింది. ప్రధానంగా మొయిన్ అలీ(Moeen Ali )బౌలింగ్ ఆకట్టుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 208 రన్స్ చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ 91 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మిచెల్ మార్ష్ ఒక్కడే రాణించాడు.
బౌలర్ల పరంగా సీఎస్కే డామినేట్ చేసింది. మొయిన్ అలీ 4 ఓవర్లు వేసి 3 వికెట్లు తీశాడు. తన అద్భుతమైన బంతులతో తిప్పేశాడు.
గత కొంత కాలం నుంచి మొయిన్ అలీ ఐపీఎల్ లో సీఎస్కే కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మొయిన్ అలీ పూర్తి పేరు మొయిన్ మునీర్ అలీ. 18 జూన్ 1987లో ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హోమ్ లో పుట్టాడు.
ప్రస్తుతం వయసు 34. ఆల్ రౌండర్ గా పేరొందాడు. ఇంగ్లాండ్ కు ప్రాతినిధ్యం వహించాడు. 12 జూన్ 2014 శ్రీలంకతో టెస్టు అరంగేట్రం చేశాడు. 28 ఫిబ్రవరి 2014లో విండీస్ తో వన్డే మ్యాచ్ ప్రారంభించాడు.
11 మార్చి 2014 విండీస్ తో టీ20 తో ఆడాడు. 2005-2006 లో వార్విక్లైర్ తరపున ఆడాడు. 2007 నుంచి వోర్సెస్టర్ షైర్ తరపున ఆడుతూ వస్తున్నాడు.
2011 నుంచి 2012 వరకు మూర్స్ స్పోర్ట్స్ క్లబ్ , 2012 నుంచి 2013 దాకా మటబెల్లెలాండ్ టస్కర్స్ , 2012-13 దాకా దురంతో రాజ్ షాహి, , దురంతో రాజ్ షామి తరపున ఆడాడు.
ఐపీఎల్ లో మొదటి సారి 2018 నుంచి 2020 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. 2019లో కేప్ టౌన్ బ్లిట్జ్ , 2020లో ముల్తాన్ సుల్తాన్ తరపున ఆడితే 2021లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
Also Read : డేవాన్ కాన్వే మారథాన్ ఇన్నింగ్స్