Mohamed Salah : వరల్ట్ స్టార్ ఫుట్ బాలర్ మహమ్మద్ సలాహ్ ఇక గుడ్ బై చెప్పనున్నాడు. ఆట నుంచి నిష్క్రమించనున్నాడా. అదే అవునని అనిపిస్తోంది. ఈ ఏడాది ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా ఈజిప్టు తరపున సలాహ్ ప్రాతినిధ్యం వహించాడు.
భవిష్యత్తులో ఇక ఆడలేనేమోనంటూ అనుమానం వ్యక్తం చేశాడు. సెనగల్ టీమ్ తో జరిగిన మ్యాచ్ లో ఈజిప్టు ఓటమి చవి చూసింది. ఈసందర్భంగా ఈజిప్టు యువత, క్రీడా శాఖ మంత్రిత్వ శాఖకు ఇచ్చిన వీడియో సందేశంలో సలాహ్ (Mohamed Salah )ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
యువతకు , దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందన్నాడు. నేను ఇక్కడ ఉన్నా లేక పోయినా జట్టు గురించి తాను గర్వ పడుతున్నానని చెప్పాడు. సెనెగల్ చేతిలో ఓటమి పాలయ్యాక లాకర్ రూమ్ లో తన సహచరులను ఉద్దేశించి మాట్లాడాడు.
నేను మ్యాచ్ కు ముందు ఆటగాళ్లతో చెప్పాను. మీ అందరితో కలిసి ఇన్నాళ్లు ఆడినందుకు గర్వంగా ఉందన్నాడు సలాహ్. నేను ఆడిన అత్యుత్తమ ఆటగాళ్లలో మీరు కూడా ఉన్నారని పేర్కొన్నాడు. ఇక చెప్పడానికి ఏమీ లేదన్నాడు.
ఇవాళ నేను ఉండ వచ్చు. అలాగని లేక పోవచ్చు. కానీ ఇన్నేళ్లుగా మీతో కలిసి నడవడం, ఆడడం తనకు సంతోషాన్ని కలిగిస్తోందన్నాడు సలాహ్(Mohamed Salah ). సలాహ్ చేసిన వ్యాఖ్యలు త్వరలో రిటైర్మెంట్ ప్రకటించ వచ్చని సూచిస్తున్నాయి.
29 ఏళ్లు ఉన్న సలాహ్ 2011లో ఈజిప్టు జాతీయ జట్టుతో తన కెరీర్ స్టార్ట్ చేశాడు. 2017 ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ లో చివరి క్షణంలో గోల్ చేశాడు. 2018లో వరల్డ్ కప్ లో ఈజిప్టును పంపడంలో కీలక పాత్ర పోషించాడు.
Also Read : షమీ ప్రతాపం ముద్దుగుమ్మ ఆనందం