Mohammad Azharuddin : విరాట్ కోహ్లీపై అజ్జూ భాయ్ కామెంట్

ఇంగ్లండ్ టూర్ లో రాణించే చాన్స్

Mohammad Azharuddin : ప్ర‌పంచ క్రికెట్ లో ప‌రుగుల వ‌ర‌ద పారించిన క్రికెటర్ గా పేరొందాడు భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా ఆశించిన మేర రాణించ లేక పోతున్నాడు.

తాజాగా భార‌త్ లో జ‌రిగిన ప్ర‌తిష్టాత్మ‌క‌మైన రిచ్ లీగ్ ఐపీఎల్ 2022 లో అత్యంత దారుణ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. కేవ‌లం రెండు 50 లు మాత్ర‌మే చేశాడు.

జ‌ట్టుకు ఎంపికైనా కోహ్లీ ప‌రిస్థితి దారుణంగా ఉంది. మొత్తం ఐపీఎల్ లో కోహ్లీ 16 మ్యాచ్ లు ఆడాడు. కేవ‌లం 341 ప‌రుగులు చేశాడు. స్వ‌దేశంలో జ‌రిగే సౌతాఫ్రికా టూర్ కు దూరంగా ఉన్నాడు.

ఈ మేర‌కు విశ్రాంతి తీసుకున్న అనంత‌రం ఇంగ్లండ్ లో జ‌రిగే రీ షెడ్యూల్ టెస్ట్ కు అందుబాటులో ఉంటాడు. కోహ్లీ పూర్ ప‌ర్ ఫార్మెన్స్ పై స్పందించాడు భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్ద‌న్(Mohammad Azharuddin). ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

కోహ్లీ ప్ర‌స్తుతం ఒత్తిడిలో ఉన్నాడ‌ని, ఇంగ్లండ్ లో రాణించే చాన్స్ ఉంద‌ని పేర్కొన్నాడు. ఒక్క‌సారి ఫామ్ లోకి వ‌చ్చాడంటే అద్భుతంగా రాణిస్తాడ‌ని తెలిపాడు.

చాలా మంది 50 ప‌రుగులు చేస్తే కూడా కోహ్లీని త‌ప్పు ప‌డుతున్నారు. ప్ర‌తి ఆట‌గాడికి ఇలాంటి ఇబ్బంది ఎదుర‌వుతూనే ఉంటుంది. అంద‌రూ 100 శాతం ఆడ‌డం క‌ష్టమ‌ని , ప్ర‌తి మ్యాచ్ లో సెంచ‌రీ చేయ‌డం ఇబ్బందిగా ఉంటుంద‌న్నాడు.

ఫ్యాన్స్ ఎల్ల‌ప్పుడూ ధాటిగా ఆడాల‌ని కోరుకుంటార‌ని అలా ఆడ‌డం ఇప్ప‌ట్లో సాధ్యం కాద‌ని స్ప‌ష్టం చేశాడు మ‌హమ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్(Mohammad Azharuddin).

Also Read : కోహ్లీ..రోహిత్ రాణించ‌క పోతే క‌ష్టం

Leave A Reply

Your Email Id will not be published!