Mohammed Azaharuddin : పంత్ తీరుపై అజ‌హ‌రుద్దీన్ ఫైర్

ఇది క్రీడా స్పూర్తికి పూర్తిగా విరుద్దం

Mohammed Azaharuddin : ఐపీఎల్ లో భాగంగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్ లో ఆఖ‌రు ఓవ‌ర్ లో నో బాల్ వ్య‌వ‌హారం తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. ఈ సంద‌ర్భంగా నో బాల్ ఇచ్చేందుకు అంపైర్ నిరాక‌రించ‌డంతో ఆగ్ర‌హంతో ఊగి పోయాడు ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ రిష‌భ్ పంత్.

అత‌డితో పాటు శార్దూల్ కూడా స‌పోర్ట్ చేయ‌డం. ఇక కోచ్ గా ఉన్న ప్ర‌వీణ్ ఆమ్రే సైతం అంపైర్ తో గొడ‌వ‌కు దిగ‌డం తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. తాజా, మాజీ ఆట‌గాళ్లు పంత్ ప్ర‌వ‌ర్తించిన తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇది క్రికెట్ క్రీడా స్పూర్తికి పూర్తిగా విరుద్ద‌మంటూ పేర్కొన్నారు. భార‌త క్రికెట్ జ‌ట్టుకు ఎన‌లేని విజ‌యాలు సాధించి పెట్టిన‌, మాజీ కెప్టెన్ మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ (Mohammed Azaharuddin)తీవ్రంగా స్పందించాడు.

ఇది ముమ్మాటికీ త‌ప్పేన‌ని పేర్కొన్నాడు. భ‌విష్య‌త్తులో ఇలాంటివి జ‌ర‌గ‌కుండా చూడాల‌న్నాడు. జెంటిల్ మెన్ గేమ్ లో ఇలాంటికి చోటు ఉండ‌ద‌న్నాడు. ఈ సంద‌ర్భంగా అజ్జూ భాయ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించాడు.

ఢిల్లీ క్యాపిట‌ల్స్ వ్య‌వ‌హ‌రించిన తీరు స‌భ్య స‌మాజం సిగ్గు ప‌డేలా వ్య‌వ‌హ‌రించిందంటూ పేర్కొన్నాడు. మాజీ ప్లేయ‌ర్ వ‌సీం జాఫ‌ర్ సైతం సీరియ‌స్ కామెంట్ చేశాడు పంత్ పై.

ఇది క్రికెట్ ఆట అన్నాక త‌ప్పులు జ‌రుగుతాయి. స‌ర్దుకు పోవాల‌న్నాడు. ఇక ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, ఐపీఎల్ కామెంటేట‌ర్ కెవిన్ పీట‌ర్స‌న్ అయితే ఇలాంటివి ఇక్క‌డ జ‌ర‌గ కూడ‌ద‌న్నాడు. రికీ పాంటింగ్ ఉంటే ఇది జ‌రిగి ఉండేది కాద‌న్నాడు.

Also Read : ఉత్కంఠ రేపిన నో బాల్ వివాదం

Leave A Reply

Your Email Id will not be published!