Lokesh Kanagaraj LEO : లియోపై భారీ అంచనాలు
లోకేష్ కనగరాజ్ మేకింగ్ అదుర్స్
Lokesh Kanagaraj LEO : మినిమం గ్యారెంటీ దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఇక మ్యాక్సిమం నటుడిగా పేరు పొందాడు తళపతి విజయ్. ఇక వీరితో పాటు దిగ్గజ నటుడు సంజయ్ దత్ తోడైతే ఆ సినిమా ఎలా ఉంటుందో ఊహించు కోగలమా. అదే వీరి కాంబినేషన్ లో లియో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం మూవీ మేకర్స్ లియో చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
విజయ్ తన కెరీర్ లో ఇది 62వ మూవీ. ఇక లోకేష్ కనగరాజ్(Lokesh Kanakaraj) తో రెండవ చిత్రం కావడం విశేషం. నటనలో టాప్ స్టేజ్ లో పర్ ఫార్మెన్స్ కనబర్చే విజయ్ తో ఇంకెన్ని ప్రయోగాలు చేస్తాడోనన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఇప్పటికే కోలీవుడ్ లో భారీ ఎత్తున అభిమానులను కలిగి ఉన్నాడు తళపతి విజయ్. సినిమా పూర్తి దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసి త్వరలో రిలీజ్ చేయాలని ప్రయత్నం చేస్తు్న్నాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్.
లియో చిత్రానికి ఎస్. ఎస్. లలిత్ కుమార్ నిర్మాత . చిత్రంలో విజయ్ తో పాటు సంజయ్ దత్ , త్రిష , అర్జున్ సర్జా, ప్రియాం ఆనంద్ , మిస్కిన్ , గౌతమ్ వాసుదేవ మీనన్ , మన్సూర్ అలీ ఖాన్ నటించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 19న లియోను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్.
Also Read : Lokesh Kanagaraj LEO : లియోపై భారీ అంచనాలు