Motorola : స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలలో మోటరోలా (Motorola) దుమ్ము రేపుతోంది. ఇప్పటికే వినియోగదారులు, మొబైల్ ప్రియుల అభిరుచులకు అనుగుణంగా ఆయా కంపెనీలు తమ డిజైన్లను తయారు చేయడంలో నిమగ్నం అయ్యాయి.
తాజాగా మోటరోలా (Motorola )అరుదైన ఘనత సాధించింది. ఈ మేరకు అమెరికాలో మూడో అతి పెద్ద స్మార్ట్ ఫోన్ (Smart Phone) తయారీ కంపెనీ గా మోటరోలా చరిత్ర సృష్టించింది. మిగతా కంపెనీలను విస్తు పోయేలా చేసింది.
2021 సంవత్సరానికి సంబంధించి యాపిల్, శామ్ సంగ్ మొబైల్ కంపెనీలు ఫస్ట్, రెండో స్థానాల్లో నిలిచాయి. ఇక మోటరోలా మూడో ప్లేస్ చేజిక్కించుకుంది. ఇదిలా ఉండగా గత కొన్నేళ్లుగా యాపిల్ టాప్ లో ఉంటూ వచ్చింది.
ఇప్పటి వరకు యాపిల్ తో పాటు శామ్ సంగ్ , బ్లాక్ బెర్రీ, ఎల్జీ, సోనీ, మోటరోలా కంపెనీలు పోటీ పడ్డాయి. సోని, ఎల్జీ కంపెనీలు అటు ఇటు ఊగిస లాడుతున్నాయి. మార్కెట్ లో చైనా ఫోన్లు (Phone) వచ్చే సరికల్లా మార్కెట్ లో ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి.
ఇదిలా ఉండగా మొదట మోటరొలాను గూగుల్ స్వంతం చేసుకుంది. కానీ దాని పనితీరు మారలేదు. దీంతో గూగుల్ లెనోవో సంస్థకు అమ్మేసింది. దీంతో సదరు కంపెనీ అధిక భారం నుంచి తప్పించు కునేందుకు భారీ ప్లాన్ చేసింది.
ఈ మేరకకు అందరికీ అందబాటులో ఉండేలా బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ (Smart Phone) ను తయారు చేసింది. దీంతో ఈ ఐడియా వర్కవుట్ అయ్యింది. దీంతో బడ్జెట్ ఫోన్లపైనే (Phone) ఎక్కువగా ఫోకస్ పెట్టింది.
Also Read : మళ్లీ పెట్రోల్..డీజిల్ ధరలు పైపైకి