MP Akhilesh Yadav : కేంద్రంలో సర్కార్ కుప్పకూలనుందంటూ విమర్శలు చేసిన సమాజ్ వాది పార్టీ చీఫ్

బీజేపీ ప్రభుత్వం 400 సీట్లు గెలుచుకోకుండా 240 సీట్లకే పరిమితం చేశారని చెప్పారు...

MP Akhilesh Yadav : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసపూరిత ఎత్తుగడలతో అధికారం నిలబెట్టుకుంటోందని, త్వరలోనే ఆ ప్రభుత్వ కప్పుకూలుతుందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) జోస్యం చెప్పారు. పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో ఆదివారంనాడు జరిగిన టీఎంసీ ధర్మ్‌తలా ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, అడ్డదారులు తొక్కయినా అధికారాన్ని కైవసం చేసుకోవాలని కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. బెంగాల్ ప్రజలు బీజేపీతో పోరాడి ఆ పార్టీని వెనక్కి నెట్టేశారని అన్నారు. ఢిల్లీ గద్దెపై కూర్చున్న పాలకులు మరి కొద్దిరోజులు మాత్రమే అధికారంలో ఉంటారని చెప్పారు. లోక్‌సభలో కూడా ఇదే మాట చెప్పానని, మళ్లీ ఈరోజు కూడా అదే మాట చెబుతున్నానని అన్నారు. అతి తర్వలోనే కేంద్ర ప్రభుత్వం కుప్పకూడం ఖాయమని అన్నారు.

MP Akhilesh Yadav Comment

టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ, బెంగాల్‌లు నిధులను బీజేపీ ఆపేసిందని, ఇందుకు ప్రతిగా లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం 400 సీట్లు గెలుచుకోకుండా 240 సీట్లకే పరిమితం చేశారని చెప్పారు. టీఎంసీపై ఈడీ, సీబీఐలను ఉసిగొల్పినప్పటికీ విజయం సాధించలేకపోయారని అన్నారు. సందేశ్ ఖాలీ ఘటనపై వక్రభాష్యాలు చెప్పి బెంగాల్‌ను అప్రతిష్ట పాలు చేయాలని బీజేపీ ప్రయత్నించినప్పటికీ అక్కడి ప్రజలు తమకు బాసటగా నిలిచారని, ఇదే లోక్‌సభ సీటులో 3.50 లక్షల ఓట్లను బీజేపీ కోల్పోయిందని వివరించారు. 1993లో పశ్చిమబెంగాల్‌లో జరిగిన నిరసనలపై కాల్పులు జరపడటంతో మృతి చెందిన 13 మంది స్మృత్మర్ధం టీఎంసీ ఏటా ఈ షాహిద్ దివస్ (అమరవీరుల దినోత్సవం) జరుపుతుంది.

Also Read : Hardik Pandya : హార్దిక్ పాండ్యా కు మరో భారీ షాక్ ఇచ్చిన టీమ్ ఇండియా హెడ్ కోచ్

Leave A Reply

Your Email Id will not be published!