MP Dharmapuri Arvind : సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ నే ఫాలో అవుతున్నారు
దీక్షపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారని.....
Dharmapuri Arvind : ఇందిరాపార్క్ వద్ద బీజేపీ(BJP) రైతు దీక్ష కొనసాగుతోంది. బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ 24 గంటల నిరంతర దీక్షలో ఉన్నారు. వీరి దీక్షకు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. మంగళవారం ఉదయం ఇందిరాపార్క్ వద్దకు చేరుకున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్(Dharmapuri Arvind) దీక్షకు మద్దతుతెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ దీక్షకు కాంగ్రెస్‌కు భయం పట్టుకుందన్నారు.
MP Dharmapuri Arvind Comment
దీక్షపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారని… ఆయనకు వయసు మీద పడిందంటూ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రాంతీయ పంటలను విస్మరించారని.. ఇప్పుడు రేవంత్(CM Revanth Reddy) అదే ఫాలో అవుతున్నారని మండిపడ్డారు. హైడ్రాపై హైకోర్ట్ మొట్టి కాయలు వేసిందన్నారు. ‘‘ ముస్లింల ఇండ్లను ముట్టుకోలేదు. చుట్టాలను ముట్టుకోలేదు. కాంగ్రెస్ పార్టీ నేతలను ముట్టుకోలేదు. కాంగ్రెస్ టార్గెట్ అంతా హిందువులే’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరుంచడం , బ్లాక్ మెయిల్ చేయడం రేవంత్ నైజమన్నారు. 22 పంటలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతీయం చేశారన్నారు. గుజరాత్ ఆదాయం మోదీ హయాంలో ఎంత పెరిగిందో తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు పైసలు ఎలా సంపాదించాలి అనే ద్యాసనే ఉందంటూ విమర్శలు గుప్పించారు. లిక్కర్ స్కామ్‌లు చేసి జైళ్లల్లోకి వెళ్లారన్నారు. కేసీఆర్ శకం ముగిసిందని.. వచ్చే ఎన్నికల్లో ఉంటాడో పీకుతాడో తెలియదంటూ కామెంట్స్ చేశారు. కేటీఆర్, కవితల మోసం చూసి ఎవ్వరూ కూడా ఓటు వేయరన్నారు. ‘‘ మొన్నటి వరకు ముసలోడు కేసీఆర్ ఉండే ఇప్పుడు ఆయన వయస్సు 74. ఇక ఇతనితో ఏం కాదు’’ అంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కాగా… రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిర పార్క్ వద్ద 24 గంటలుగా బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ నిరంతర దీక్ష చేస్తున్నారు. రుణమాఫీ సగంమందికి కూడా పూర్తి చేయలేదని బీజేపీ ఆరోపిస్తోంది. వెంటనే అందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని కమలం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రైతు భరోసా, బోనస్ కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. బీజేపీ దీక్షపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రుణమాఫీ చేశారా అని మంత్రి ప్రశ్నించారు. కేంద్రం రైతుల ఆదాయం రెట్టింపు చేసిందా అని మంత్రి తుమ్మల అడిగారు. మంత్రి తుమ్మల వ్యాఖ్యలకు మహేశ్వర రెడ్డి, ఈటల కౌంటర్ ఇవ్వనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు 24 గంటల దీక్షను బీజేపీ నేతలు విరమించనున్నారు.
Also Read : Superstar Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ కు చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స