MP Dharmapuri Arvind : సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద సవాల్ విసిరినా బీజేపీ ఎంపీ
బిఆర్ఎస్ పార్టీ భూ స్థాపితమైందని చెప్పారు...
Dharmapuri Arvind : హైదరాబాద్ మహానగరంలోని అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేస్తోన్న హైడ్రాను.. ఓల్డ్ సిటీలో అమలు చేయగలరా ? అంటూ రేవంత్ రెడ్డి సర్కార్‌ను నిజామాబాద్ ఎంపీ డి. అర్వింద్ కుమార్ సవాల్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఓల్డ్ సిటీలో అడుగుపెట్టగలరా? అని సూటిగా ఆయన్ని సూటిగా ప్రశ్నించారు. ఆదివారం నిజామాబాద్‌లో ఎంపీ అర్వింద్ కుమార్(Dharmapuri Arvind) మాట్లాడుతూ.. హిందూ, ముస్లింలలో ఎవరి వల్ల అధికంగా ఆదాయం వస్తుందో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ పార్టీ భూ స్థాపితమైందని చెప్పారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ శకం.. సైతం ముగిసిందన్నారు.
MP Dharmapuri Arvind Slams
భారతదేశాన్ని కాషాయమయం చేయటమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మరికొద్ది రోజుల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయటం బాధ్యతగా భావించాలని ఈ సందర్భంగా ఓటర్లకు ఆయన విజ్జప్తి చేశారు. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి కులాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. మోడీని విమర్శించే స్థాయి సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు. హామీలు తీర్చలేక రేవంత్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావటం లేదని ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని ఎంపీ అర్వింద్(Dharmapuri Arvind) గుర్తు చేశారు.
ఇక బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ సైతం నిజామాబాద్‌లో మాట్లాడుతూ.. మరికొద్ది రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయని.. అయితే ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలకు అభ్యర్థులు కరువయ్యారని వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఈ ఎన్నికలు… రాష్ట్ర రాజకీయాల్లో మలుపు కాబోతోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమైందన్నారు. దేశమంతా బీజేపీ గాలి వీస్తోందని తెలిపారు. ఉద్యోగాలు సైతం ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగులు ఎందుకు ఓట్లెయ్యాలని ప్రశ్నించారు. అంతేకాదు.. టీచర్లకు డీఏలు, పీఆర్సీలు ఇవ్వలేదన్నారు. అలాంటి వారు.. ఓట్లు ఎలా అడుగుతారంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి టైం పాస్ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చు పెడుతూ.. కుల రాజకీయలు చేస్తున్నారని మండిపడ్డారు.
కులగణనతో బీసీల పొట్టగొడుతున్నారన్నారు. ముస్లింల కోసమే ఈ కుల గణన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి కుల గణనపై చిత్తశుద్ది లేదన్నారు. అందుకే రీ సర్వే చేస్తున్నారంటూ ఎంపీ బీజేపీ డి. అర్వింద్ కుమార్ ఆరోపించారు.
Also Read : IND vs PAK : ఇండియా తో మ్యాచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పాక్ వైస్ కెప్టెన్