MP Eatala Rajender : కాంగ్రెస్ తాట తీసే శక్తీ ప్రజలకు రైతులకు మాత్రమే ఉంది

ప్రభుత్వం ఇస్తా అన్న 2 లక్షల రూపాయలు రైతుల అకౌంట్‌లో వేయాలని డిమాండ్ చేశారు...

Eatala Rajender : నగరంలోని ఇందిరాపార్క్ వద్ద 24 గంటలుగా బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ నిరంతర దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా మాల్కజ్‌గిరి ఎంపీ ఈటెల(Eatala Rajender) మాట్లాడుతూ.. ‘‘మాట వినని వాడు సైకో అవుతాడు.. ప్రజలను ఏడిపించి .. సంతోషించే వాడు శాడిస్ట్ అవుతాడు’’ అంటూ ఎంపీ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తాట తీసే శక్తి ప్రజలకు, రైతులకు ఉంటుందన్నారు. ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని హెచ్చరించారు. ‘‘ మీ అంతరాత్మ సాక్షిగా ఏది అనిపిస్తే అది చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన చిలుక పలుకులు మాట్లాడితే మీ గౌరవం పోతుంది’’ మంత్రి తుమ్మలను ఉద్దేశించి హితవుపలికారు.

Eatala Rajender Slams..

ప్రభుత్వం ఇస్తా అన్న 2 లక్షల రూపాయలు రైతుల అకౌంట్‌లో వేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం తరహాలోనే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు బొందపెడతారన్నారు. రెండు మూడు రోజుల్లో రింగ్ రోడ్డు వద్ద ధర్నా చేస్తామన్నారు. సాక్షాత్తు హైకోర్టు హైడ్రాపై మొట్టికాయలు వేసిందని.. అవి వేసింది హైడ్రాపై కాదు నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి వేసిందంటూ వ్యాఖ్యలు చేశారు. ‘‘ కోర్టు వ్యాఖ్యలతో అయినా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న. ప్రజలు నీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం’’ అంటూ ఎంపీ ఈటెల రాజేందర్(Eatala Rajender) స్పష్టం చేశారు.

మరోవైపు బీజేపీ నేతల దీక్షకు ఆపార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ మద్దతు తెలిపారు. మంగళవారం ఉదయం ఇందరాపార్క్‌ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవితపై హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ(BJP) దీక్షకు కాంగ్రెస్‌కు భయం పట్టుకుందన్నారు. దీక్షపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారని… ఆయనకు వయసు మీద పడిందంటూ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రాంతీయ పంటలను విస్మరించారని.. ఇప్పుడు రేవంత్ అదే ఫాలో అవుతున్నారని మండిపడ్డారు. హైడ్రాపై హైకోర్ట్ మొట్టి కాయలు వేసిందన్నారు. ‘‘ ముస్లింల ఇండ్లను ముట్టుకోలేదు. చుట్టాలను ముట్టుకోలేదు. కాంగ్రెస్ పార్టీ నేతలను ముట్టుకోలేదు.

కాంగ్రెస్ టార్గెట్ అంతా హిందువులే’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరుంచడం , బ్లాక్ మెయిల్ చేయడం రేవంత్ నైజమన్నారు. 22 పంటలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతీయం చేశారన్నారు. గుజరాత్ ఆదాయం మోదీ హయాంలో ఎంత పెరిగిందో తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు పైసలు ఎలా సంపాదించాలి అనే ద్యాసనే ఉందంటూ విమర్శలు గుప్పించారు. లిక్కర్ స్కామ్‌లు చేసి జైళ్లల్లోకి వెళ్లారన్నారు. కేసీఆర్ శకం ముగిసిందని.. వచ్చే ఎన్నికల్లో ఉంటాడో పీకుతాడో తెలియదంటూ కామెంట్స్ చేశారు. కేటీఆర్, కవితల మోసం చూసి ఎవ్వరూ కూడా ఓటు వేయరన్నారు. ‘‘ మొన్నటి వరకు ముసలోడు కేసీఆర్ ఉండే ఇప్పుడు ఆయన వయస్సు 74. ఇక ఇతనితో ఏం కాదు’’ అంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Also Read : Uttar Pradesh : యువతిని హత్య చేసిన ముగ్గురిపై పోలీసులు కాల్పులు

Leave A Reply

Your Email Id will not be published!