MP Jaya Bachchan : రాజ్యసభ లో అసహనం వ్యక్తం చేసిన జయా బచ్చన్

దీంతో హరి వంశ నారాయణ్ సింగ్ స్పందిస్తూ.. పార్లమెంట్ రికార్డుల్లో మీ పేరు....

MP Jaya Bachchan : బిగ్ బి అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ చాలా కామ్ గోయింగ్‌గా ఉంటారు. ఇంకా చెప్పాలంటే చాలా చాలా సాదా సీదాగా ఉంటారు. దేశంలో అత్యంత ప్రముఖల్లో ఒకరైన అమితాబ్ భార్యగా నిత్యం వార్తల్లో ఉండాలని ఆమె ఏ మాత్రం భావించరు. సరికదా.. అందుకు తగినట్లుగానే ఆమె వ్యవహార శైలి ఉంటుంది. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే అలాంటి జయాబచ్చన్(MP Jaya Bachchan).. అందుకు విరుద్దంగా వ్యవహరించారు. అందుకు పెద్దల సభ.. రాజ్యసభ వేదిక అయింది. సోమవారం రాజ్యసభలో న్యూఢిల్లీలో సివిల్స్ ఆశావహులు ముగ్గురు మృతి అంశంపై చర్చ వాడి వేడిగా జరుగుతుంది. ఆ క్రమంలో రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ స్థానంలో ఉన్న హరివంశ నారాయణ్ సింగ్.. శ్రీమతి జయా అమితాబ్ బచ్చన్ జీ మీరు మాట్లాడండంటూ జయా బచ్చన్‌(MP Jaya Bachchan)ను పిలిచారు. ఆ వెంటనే.. తన స్థానంలో నుంచి లేచి తనను జయా బచ్చన్ అని పిలవండి చాలంటూ హరివంశ నారాయణ్ సింగ్‌కు ఆమె విజ్జప్తి చేశారు.

MP Jaya Bachchan Comment

దీంతో హరి వంశ నారాయణ్ సింగ్ స్పందిస్తూ.. పార్లమెంట్ రికార్డుల్లో మీ పేరు.. శ్రీమతి జయా అమితాబ్ బచ్చన్ అని రాసి ఉందని.. దానినే తాను సంభోదించానని ఆమెకు స్పష్టం చేశారు. అందుకు ప్రతిగా జయా బచ్చన్(MP Jaya Bachchan) ఇలా స్పందించారు.. ఇది చాలా కొత్త‌గా ఉంద‌న్నారు. భ‌ర్త పేరుతోనే మ‌హిళ‌కు గుర్తింపు వ‌స్తుందా? అని ఆమె ప్ర‌శ్నించారు. మ‌హిళ‌ల‌కు స్వంతంగా ఉనికి లేదా? అని సందేహం వ్యక్తం చేశారు. వాళ్లు స్వంతంగా ఏమీ సాధించ‌లేరా? అంటూ జయా బ‌చ్చ‌న్ రాజ్యసభలో తన కోపాన్ని బయట పెట్టారు.

అనంతరం ఆమె కాస్తాంత చల్ల బడ్డారు. ఆ క్రమంలో ఢిల్లీలో ముగ్గురు యూపీఎస్సీ విద్యార్థులు మరణం చాలా బాధాకారమన్నారు. ఈ అంశాన్ని రాజకీయం చేయకండి అంటూ రాజ్యసభలో జయా బచ్చన్ స్పష్టం చేశారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇటీవల ఎడతెరపి లేకుండా భారీ వర్షాల కురిశాయి. దీంతో పలు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు వరద నీరు వచ్చి చేరింది. దాంతో రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లోకి వరద నీరు భారీగా చేరింది. దీంతో ముగ్గురు సివిల్స్ ఆశావహులు నీట మునిగి మరణించారు.

ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడం పట్ల వివిధ రాజకీయ పార్టీల నుంచి తీవ్ర విస్మయం వ్యక్తమవుతుంది. ఆ క్రమంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ పాలనపై విమర్శనాస్త్రాలు సంధిస్తుంది. ఢిల్లీలో మౌలిక సదుపాయాల కల్పనలో ఆప్ ప్రభుత్వ వైఖరి వల్లే ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయంటూ బీజేపీ ఆరోపణలు గుప్పిస్తుంది. మరోవైపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈ ఘటనపై చర్చ వాడి వేడిగా నడుస్తుంది.

Also Read : AP Tourism : ఏపీలో ఆ జలపాతాల సందర్శనకు అనుమతులిచ్చిన ఏపీ టూరిజం

Leave A Reply

Your Email Id will not be published!