Nusrat Jahan Pathan : ప్రేక్షకుల ఇష్టం మీకెందుకు కష్టం
పఠాన్ పాటపై నుస్రత్ జహాన్ ఫైర్
Nusrat Jahan Pathan : దీపికా పదుకొణే, షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీపై వివాదం చోటు చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన బేషరమ్ సాంగ్ పై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. అభ్యంతరంగా ఉందని, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పాటను చిత్రీకరించారంటూ భారతీయ జనతా పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
చివరకు మధ్య ప్రదేశ్ మంత్రి షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ రాష్ట్రంలో నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా కావాలని హిందువులను టార్గెట్ చేస్తున్నారని మరాఠాలో పఠాన్ మూవీని విడుదల చేసేందుకు తాము ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్. ఆయన నిప్పులు చెరిగారు.
ఓ వైపు విమర్శలు తలెత్తుతుండగా మరో వైపు పఠాన్ మూవీకి మద్దతు కూడా పెరుగుతోంది. ఈ తరుణంలో సంచలన వ్యాఖ్యలు చేశారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ నుస్రత్ జహాన్(Nusrat Jahan Pathan). దేశంలో రోజు రోజుకు మహిళలు ఏం వేసుకోవాలో ఏం వేసుకోకూడదో బీజేపీ నిర్ణయించే స్థాయికి చేరుకుందన్నారు.
ఎవరికి తోచిన దుస్తులు వారు ధరిస్తారని అన్నారు. అలా అని అన్నీ తీసేసి సినిమా చేయలేదు కదా అని ప్రశ్నించారు నుస్రత్ జహాన్. బేషరమ్ సాంగ్ లో అభ్యంతరం చెప్పాల్సింది ఏముందని ప్రశ్నించారు. దీపికా పదుకొణే చాలా అందంగా ఉందంటూ కితాబు ఇచ్చారు. సినిమా నచ్చుతుందో లేదో ప్రేక్షకులు నిర్ణయిస్తారు మధ్యలో మీకెందుకు కష్టం అంటూ మండిపడ్డారు నుస్రత్ జహాన్.
ప్రస్తుతం ఎంపీ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : అమితాబ్ కు భారత రత్న ఇవ్వాలి – దీదీ