MP Purandeswari : తిరుమల లడ్డు కల్తీ చంద్రబాబు ప్రకటించడంపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ

సీఎంగా ఆయన అపచారం జరిగిన విషయాన్ని ప్రజలకు తెలియ చెప్పి ఉంటారని చెప్పారు...

MP Purandeswari : తిరుమల లడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబుకు వచ్చిన సమాచారంతో ఆయన ప్రకటన చేశారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. అధికారులతో సమీక్ష చేసుకున్న తర్వాతే తిరుమల లడ్డూ విషయంపై మాట్లాడి ఉంటారని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దగ్గుబాటి పురంధేశ్వరి(MP Purandeswari) పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి.. ఆయా సమస్యలపై అధికారుతో మాట్లాడారు.

MP Purandeswari Comment

ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ… సీఎంగా ఆయన అపచారం జరిగిన విషయాన్ని ప్రజలకు తెలియ చెప్పి ఉంటారని చెప్పారు. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఎలా అమలవుతున్నాయనేది పరిగణలోకి కోర్టు తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని ‘మీరు ఎందుకు అలా మాట్లాడారు అని కోర్టులకు అడిగే హక్కు ఉంటుందా అనేది అందరూ ఆలోచన చేయాలి. లడ్డూ విషయంలో న్యాయస్థానంలో కూడా విచారణ జరుగుతుంది. వివిధ సమస్యలపై ప్రజలు విజ్ఞాపన పత్రాలు అందిస్తున్నారని అన్నారు. సంబంధిత శాఖల అధికారులతో పోన్ చేసి మాట్లాడుతున్నాం. భూ సమస్యలు ఎక్కువుగా వస్తున్నందున.. ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపిస్తున్నాం. బదిలీలు, ఉపాధి అవకాశాలపై కూడా వినతి పత్రాలు ఇస్తున్నారు. ప్రైవేటు సంస్థలకు అయితే ఫోన్ చేసి చెబుతున్నాం. వారధి అనే కార్యక్రమం ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగానే పని చేస్తుంది. ఈరోజు కూడా భూ వివాదాలు రాగానే… ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపిస్తున్నాం’’ అని దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు.

Also Read : MP Eatala Rajender : కాంగ్రెస్ తాట తీసే శక్తీ ప్రజలకు రైతులకు మాత్రమే ఉంది

Leave A Reply

Your Email Id will not be published!