MP Purandeswari : సంధ్య థియేటర్ వద్ద జరిగిన ప్రమాదం అల్లు అర్జున్ ప్రేరేపించింది కాదు

అలాగే ఈ బిల్లును పరిశీలన, చర్చ కోసం ప్రభుత్వం జేపీసీకి పంపడానికి సిద్దంగా ఉందన్నారు...

MP Purandeswari : టాలీవుడ్ సినీ హీరో అల్లు అర్జున్ నటించిన ‘పుష్పా-2‘ చిత్రం విడుదల కావడంతో ఓ హీరోగా ఆయన థియేటర్‌లో సినిమా చూసేందుకు వెళ్ళారని, అప్పుడు జరిగిన ప్రమాదం ఆయన ప్రేరేపించింది కాదని, బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి(MP Purandeswari) అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆదివారం ఆమె ప్రకాశంలో మీడియాతో మాట్లాడుతూ… ఈ కేసులో మిగిలిన వారిని అరెస్టు చేయకుండా ఏ11గా ఉన్న అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదని అన్నారు.

MP Purandeswari Comments

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు ఈనెల 13వ తేదీ (శుక్రవారం) అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్(Allu Arjun) నటించిన పుష్పా -2 సినిమా చూసేందుకు వచ్చి అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సంధ్యా థియేటర్ యజమానితోపాటు మేనేజర్‌ను అరెస్టు చేశారు. సరైన భద్రతా చర్యలు చేపట్టని సెక్యూరిటీ మేనేజర్‌ను కూడా అరెస్టు చేశారు. ముగ్గురిని అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీసులు రిమాండ్‌కు పంపించారు. ఈ ఘటనపై పోలీసులు సంచలన విషయాలు మీడియా ముందుకు తెచ్చిన విషయం తెలిసిందే.

కాగాజమిలి ఎన్నికల బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగిందని, జేపీసీకి బిల్లును రిఫర్ చేశారని, ఇది ఒక్క పార్టీ తీసుకునే నిర్ణయం కాదని పురందేశ్వరి(MP Purandeswari) అన్నారు. పార్టీలతో పాటు ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు జేపీసీ నిర్మాణం చేశారని ఆమె స్పష్టం చేశారు. కాగా జమిలి ఎన్నికల సవరణ బిల్లును లోక్ సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జు్న్ రామ్ మేఘవాల్ ఈనెల 17న (మంగళవారం) ప్రవేశపెట్టారు. అనంతరం ఈ సవరణ బిల్లుపై మంత్రి మాట్లాడుతూ.. సమాఖ్య స్పూర్తికి బమిలి బిల్లు విరుద్దం కాదని స్పష్టం చేశారు. జమిలి ఎన్నికల నిర్వహణ అంశం కొత్తది కాదన్నారు. ఈ బిల్లుతో రాష్ట్రాల హక్కులకు ఎటువంటి భంగం వాటిల్లదని చెప్పారు. పార్లమెంట్, అసెంబ్లీల కాలపరిమితిపై నిర్ణయం తీసుకొనే అధికారం పార్లమెంట్‌కు రాజ్యాంగం కల్పించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

అలాగే ఈ బిల్లును పరిశీలన, చర్చ కోసం ప్రభుత్వం జేపీసీకి పంపడానికి సిద్దంగా ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికలతోపాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకే సారి నిర్వహించాలని ప్రతిపాదించే బిల్లును మరింత క్షుణ్ణంగా సమీక్షించాలని పలువురు ఎంపీల సిఫార్స్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఆ తర్వాత ఈ బిల్లును జేపీసీకి పంపడానికి కేంద్ర మంత్రి అర్జున్ సింగ్ మేఘవాల్ ప్రతిపాదించారు. దీనిపై లోక్ సభలో విపక్షాలు డివిజన్ కోరాయి. దీంతో డివిజన్‌కు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు. అయితే బిల్లును జేపీసీకి పంపినప్పుడు సమగ్ర చర్చ జరుగుతుందని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. అలాగే బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ జరిగినపుడు కూడా మళ్లీ సమగ్ర చర్చ జరుగుతుందని ఆయన వివరించారు. మరోవైపు పార్లమెంట్‌లో ఈ బిల్లుకు అనుకూలంగా 269 మంది సభ్యులు ఓటు వేశారు. వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చాయి. నూతన పార్లమెంట్ భవనంలో తొలిసారిగా ఎలక్ట్రానిక్ విధానంలో ఈ ఓటింగ్ జరిగింది.

Also Read : Minister Komatireddy : తొక్కిసలాటకు గురైన శ్రీతేజ్ కుటుంబానికి విరాళం ప్రకటించిన సర్కార్

Leave A Reply

Your Email Id will not be published!