MP Purandeswari : జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

నేడు ఏపీలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మంచి పాలన సాగుతుందని అన్నారు...

MP Purandeswari : తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం కల్తీ చేసిందని బీజేపీ(BJP) ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. అన్యమతస్తులను టీటీడీలోకి తీసుకోవద్దని చెప్పినా కూడా ఆనాడు మాజీ సీఎం జగన్ తమ మాట వినలేదని అన్నారు. తిరుమల గురించి లక్షలాది మంది సంతకాల సేకరణ చేసి ఇచ్చినా జగన్ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. బీజేపీ సభ్యత్వ నమోదుపై రాష్ట్రస్థాయి సమావేశం ఇవాళ(శుక్రవారం) జరిగింది. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆద్వర్యంలో జరిగిన స మావేశంలో పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధేశ్వరి(MP Purandeswari) మాట్లాడుతూ… ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక విధానాన్ని ప్రజల కోసం అమలు చేస్తోందని దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు.

నేడు ఏపీలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మంచి పాలన సాగుతుందని అన్నారు. 13 జిల్లాల్లో వైసీపీ నేతలకు నచ్చిన వారికి ఇసుక రీచ్‌లు కట్టబెట్టి దోపిడీ చేశారని దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని అన్నారు. బీజేపీ ప్రజల పక్షాన నిలబడుతుందని.. వారి కోసం కార్యకర్తలు, ఎన్డీఏ కూటమి నేతలు కలిసి నడవాలని పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో కూడా ఏపీ అభివృద్ధికి మోదీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. పోలవరం నిర్మాణం కూడా పూర్తి చేసి, రైతుల కల నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. విశాఖపట్నం స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణపై కొంతమంది రాద్దాంతం చేస్తున్నారని దగ్గుబాటి పురంధేశ్వరి(MP Purandeswari) మండిపడ్డారు. స్టీల్ పాంట్‌ను లాభాల బాటలో ఎలా నడిపించాలనే దానిపై ఇటీవల సీఎం చంద్రబాబు కూడా సమీక్ష చేశారని దగ్గుబాటి పురంధేశ్వరి గుర్తుచేశారు.

MP Purandeswari Slams..

ఇప్పుడు ఉన్న భాగస్వామ్యాన్ని అదే విధంగా కొనసాగిస్తూ.. లాభాల్లో నడిచేలా కార్యాచరణ రూపొందిస్తామని దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. గతంలో అభివృ‌ద్ధి పుల కోసం కేంద్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వాన్ని భూమిని కేటాయించాలని అడిగితే నిరుపయోగమైన భూమిని ఇచ్చారని అన్నారు. కానీ నిందలు మాత్రం కేంద్ర ప్రభుత్వంపై వేసి జగన్ తప్పుకున్నారని ధ్వజమెత్తారు. ప్రైవేటీకరణ పేరుతో జగన్ ప్రభుత్వం చేసిన అసత్యాలను తిప్పి కొట్టాలని దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే భూమిని కేటాయించారని చెప్పారు. గ్రామాలు అభివృద్ధి చెందకుండా నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని విమర్శించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 13వేల పైబడి పంచాయతీల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకే సమయంలో గ్రామసభలు నిర్వహించారని దగ్గుబాటి పురంధేశ్వరి ప్రశంసించారు. ఏపీలో ప్రతి గ్రామం అభివృద్ధి చెందేలా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తామని ప్రకటించిందని దగ్గుబాటి పురంధేశ్వరి(MP Purandeswari) అన్నారు. సర్పంచ్‌లను ఉత్తవ విగ్రహాలుగా మార్చాలని జగన్ కుట్ర చేశారని మండిపడ్డారు. మద్యంపై జరిగిన అవినీతి పైనా బీజేపీ పెద్ద ఎత్తున పోరాటం చేసిందని చెప్పారు. నాణ్యత లేని మద్యం, డిజిటల్ పేమెంట్ల ద్వారా వైసీపీ ప్రభుత్వం మద్యం వ్యాపారిగా మారిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానానికి స్వస్తి పలికి.. కొత్త విధానం అమల్లోకి తెస్తుందని దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు.

ఏపీ అభివృద్ధికి అన్ని విధాలా కేంద్రం పూర్తిగా సహకారం అందిస్తుందని తెలిపారు. రాజధాని నిర్మాణం, పోలవరం, వంటి అంశాల్లో కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఇలాంటి ఎన్నో అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి అవగాహన కల్పించాలని అన్నారు. అవినీతి రహిత పార్టీగా బీజేపీకి దేశ వ్యాప్తంగా పేరు ఉందని దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. బీజేపీ పార్టీలో చేరేలా ప్రజలను కూడా చైతన్య పరచాలని సూచించారు. సభ్యత్వ నమోదుకు రెండు వారాల వ్యవధి ఉందని.. ఈ నేపధ్యంలో సభ్యత్వాలను మరింతగా పెంచేలా బీజేపీ నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఇప్పటికి 12లక్షల సభ్యత్వాలను పూర్తి చేశామని.. ఈసంఖ్య మరింతగా పెంచేలా అందరూ కలిసి పని చేయాలని దగ్గుబాటి పురంధేశ్వరి కోరారు.

Also Read : Gold Tunnel Collapse : ఇండోనేషియాలో కుప్పకూలిన బంగారు గని… 15 మంది మృతి

Leave A Reply

Your Email Id will not be published!