MP Purandeswari : వైసీపీ వాళ్ళ అసమర్థత వల్లనే బుడమేరు గండి కొట్టింది

వైసీపీ నిర్లక్ష్య ధోరణి వల్లనే ఇంత పెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది...

MP Purandeswari : వారం రోజులపాటు కురిసిన భారీ వర్షాలకు బుడమేరుకు గండి పడి విధ్వంసం జరిగిన సంగతి తెలిసిందే. అయితే అప్రమత్తమైన ఏపీ అధికార యంత్రాంగం గండి పూడ్చివేత పనులు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఆర్మీ జవాన్లతో పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టింది. అయితే గండి పూడ్చివేత పనులను రాజమహేంద్రవరం ఎంపీ, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(MP Purandeswari) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె వైసీపీ(YSRCP)పై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి మాట్లాడుతూ..” బుడమేరు గండి పూడ్చివేత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రతి సందర్భాన్ని రాజకీయం చేయడం సమంజసం కాదు. ప్రజల ప్రాణాలు పోతున్న సందర్భంలో వైసీపీ నేతలు రాజకీయాలు మాట్లాడుతున్నారు. అసలు గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బుడమేరుకు గండి పడింది. రూ.400కోట్లతో గత టీడీపీ ప్రభుత్వం బుడమేరుకట్ట పటిష్ఠతకు పనులు చేపట్టింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసింది.

MP Purandeswari Comment

వైసీపీ నిర్లక్ష్య ధోరణి వల్లనే ఇంత పెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది. మిగిలిన పనులను వారి చేసి ఉంటే ఈనాడు ఇలాంటి దుస్థితి ఏర్పడేది కాదు. గత ఐదేళ్ల కాలంలో బుడమేరుకు వైసీపీ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో లెక్కలు చెప్పాలి. వారు చేసిన పాపాన్ని పక్కవారికి అంటకడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఏపీని వరదల సమయంలో ఆదుకుంటూ వస్తోంది. గురువారం రోజున కేంద్ర మంత్రి చౌహాన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. త్వరలో ఎంత నష్టం వాటిల్లిందో అంచనా వేసి కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తుంది” అని చెప్పారు. మరోవైపు బుడమేరు పొంగి తీవ్ర అవస్థలు పడుతున్న వరద బాధితులకు తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం అండగా నిలిచింది. ఏపీ విద్యత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆధ్వర్యంలో ఒక రోజు మూల వేతనాన్ని సీఎం సహాయనిధికి అందించి కార్మికులు పెద్ద మనసు చాటుకున్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబుకి విరాళాన్ని అందజేశారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కోట్లాది రూపాయలు వరద బాధితుల కోసం సీఎం సహాయనిధికి అందించారు.

Also Read : Kolkata Doctor Case : ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

Leave A Reply

Your Email Id will not be published!