MP Purandeswari : సమాజ పరిస్థితి తెలుసుకునేలా విద్యార్థులకు బోధన ఉండాలి

ఈ సందర్భంగా పురందరేశ్వరి మాట్లాడుతూ..

MP Purandeswari : చదువుతోపాటు విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన కల్పించాలని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి అన్నారు. నర్సాపురం వై ఎన్ కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకలు ఇవాళ(శుక్రవారం) జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా పురందరేశ్వరి హాజరయ్యారు. కళాశాల ప్రాంగణంలో సరస్వతి దేవి విగ్రహం ఆవిష్కరణ గావించారు. భోగి మంటలు వెలిగించి విద్యార్థులతో సంక్రాంతి సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ తదితరులు పాల్గొన్నారు.

MP Purandeswari Comment

ఈ సందర్భంగా పురందరేశ్వరి మాట్లాడుతూ.. విద్యార్థులకు సమగ్రమంతమైన, వికాసవంతమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు కృషి చేయాలని అన్నారు. సమాజ పరిస్థితులను తెలుసుకునే విధంగా విద్యాబోధన ఉండాలని చెప్పారు. చదువు అంటే పాఠ్యపుస్తకాలు, తరగతి గదులు , ర్యాంక్స్ మెడల్స్‌కే పరిమితం కాకూడదని తెలిపారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతలను దూరం చేసే శక్తి చదువుకే ఉందని దగ్గుబాటి పురందరేశ్వరి పేర్కొన్నారు.

Also Read : MLA Harish Rao : తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి క్వాష్ పిటిషన్

Leave A Reply

Your Email Id will not be published!