MP Soyam Bapurao : ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఇల్లు కట్టుకున్నా
బీజేపీ ఎంపీ సోయం బాపురావు కామెంట్స్
MP Soyam Bapurao : బారతీయ జనతా పార్టీ ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి తాను స్వంతంగా ఇల్లు కట్టుకున్నానని, అంతే కాకుండా తన కుమారుడి పెళ్లి కూడా చేశానని బహిరంగంగా చెప్పారు. ఎంపీ ల్యాడ్స్ నిధులు సొంత అవసరాలకు వాడుకుంటే తప్పేంటి అని ఆదిలాబాద్ ఎంపీ అన్నారు. సొంత ఇల్లు లేదని, గౌరవం ఉండదని ఎంపీ నిధులతో కట్టుకున్నానని చెప్పారు సోయం బాపురావు. ఎంపీ నిధులను నేను పక్కదారి పట్టించ లేదన్నారు.
అభివృద్ది పనులకు పంచక పోవడం కూడా వాస్తవమేనని ఒప్పుకున్నారు. మొత్తంగా బీజేపీ ఎంపీ(Soyam Bapurao) చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. విచిత్రం ఎంపీ ల్యాడ్స్ నిధులు కేవలం అభివృద్ది పనులకు మాత్రమే ఉపయోగిస్తారు. వ్యక్తిగత పనులకు, స్వంత వాటికి , కుటుంబం కోసం ఖర్చు చేయకూడదు. ఆ విషయం మరి బీజేపీ ఎంపీకి ఎందుకు తెలియ లేదో ఇప్పటికీ అర్థం కాదు.
పోనీ ఎంపీకి సోయి తప్పి ఖర్చు చేస్తుంటే సంబంధిత ఉన్నతాధికారులు తెలిసి ఊరుకున్నారా లేక కావాలని ఇలా చేశారా అన్న అనుమానం తలెత్తుతోంది. మొత్తంగా బీజేపీ ఎంపీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశంలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా ఎంపీ నిధులను స్వంత అవసరాలకు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు.
Also Read : MLA Dwarampudi : దమ్ముంటే కాకినాడ నుంచి పోటీ చేయి