Varun Gandhi : ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీకి వరుణ్ షాక్
విదేశాల్లో కామెంట్స్ వల్ల ఉపయోగం లేదు
Varun Gandhi Oxford University : భారతీయ జనతా పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ కీలక కామెంట్స్ చేశారు. తన సోదరుడు రాహుల్ గాంధీ భారత దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది పార్ల మెంట్ లో. దీనిపై వరుణ్ గాంధీ స్పందించారు. అంతర్జాతీయ ఫోరమ్ లో అంతర్గత సవాళ్లను వినిపించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని తాను అనుకుంటున్నట్లు చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడారు. భారత దేశంలో లెక్కలేనన్ని సమస్యలు పేరుకు పోయాయని , వాటిని పరిష్కరించేందుకు చాలా అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా నరేంద్ర మోదీ ప్రభుత్వ పనితీరుపై ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ(Varun Gandhi Oxford University) నుంచి వచ్చిన ఆహ్వానాన్ని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తిరస్కరించారు. కాగా ఆక్స్ ఫర్డ్ యూనియన్ ప్రెసిడెంట్ మాథ్యూ డ్రిక్ కార్యాలయం ద్వారా ఈ సభ విశ్వాసం మోదీ భారత దేశం సరైన మార్గంలో ఉంది అనే తీర్మానంపై మాట్లాడాలంటూ వరుణ్ గాంధీకి ఆహ్వానం పంపింది. ఇదిలా ఉండగా నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని పదే పదే విమర్శిస్తూ వస్తున్నారు.
ఈ దేశంలో నిరుద్యోగం ఇంకా ఎందుకుందని ప్రశ్నించారు. రైతులకు మేలు చేయని ప్రభుత్వం ఉండీ ఏం లాభమని నిలదీశారు. ఆయన ఇప్పటికే రెండు పుస్తకాలు కూడా రాశారు. రూరల్ ఎకానమీపై అద్భుతమైన అవగాహన కలిగి ఉన్నారు. అంతర్జాతీయ ఫోరమ్ లో అంతర్గత సవాళ్లను వినిపించడంలో నాకు ఎలాంటి అర్హత లేదా సమగ్రత కనిపించడం లేదంటూ పేర్కొన్నారు వరుణ్ గాంధీ(Varun Gandhi). అయితే ఆహ్వానం పంపినందుకు ధన్యవాదాలు తెలియ చేస్తున్నానని తెలిపారు.
Also Read : రాహుల్ కు ఢిల్లీ పోలీస్ నోటీస్