Shreyas Iyer : క్రికెట్ లో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. కొన్ని రోజుల్లోనే ముంబై వేదికగా మహా సంగ్రామం మొదలు కాబోతోంది. ఈనెల 26న ఐపీఎల్ 15వ సీజన్ మెగా రిచ్ లీగ్ మొదలు కాబోతోంది.
ఈ తరుణంలో భారీ ధరకు అమ్ముడు పోయిన ఆటగాడిగా పేరొందిన శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేఎల్ రాహుల్ (KL Rahul) అద్భుతమైన ప్లేయర్ అంటూ కితాబు ఇవ్వడం చర్చకు దారి తీసింది.
చాలా పాజిటివ్ నేచర్ కలిగి ఉంటాడని పేర్కొన్నాడు. బయటే కాదు క్రీజులో సైతం సపోర్ట్ గా ఉంటాడని పేర్కొన్నాడు. పూర్తిగా స్నేహ భావంతో ఉండడం తనకు నచ్చుతుందన్నాడు. తన ఫెవరేట్ కెప్టెన్ రాహుల్ అంటూ బాంబు పేల్చాడు.
ప్రస్తుతం (Indian cricket team) భారత క్రికెట్ జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్నాడు. (BCCI Deputy Leader) కేఎల్ రాహుల్ (KL Rahul) కు బీసీసీఐ ఉప నాయకుడి బాధ్యతలు అప్పగించింది. ఎలాంటి ఒత్తిళ్లలోనైనా చాలా కూల్ గా ఉంటాడని ప్రశంసించాడు శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer).
అన్ని ఫార్మాట్ ల నుంచి కోహ్లీని తప్పించిన బీసీసీఐ ఊహించని రీతిలో రోహిత్ తో పాటు రాహుల్ కు అవకాశం ఇచ్చింది. దీనిని కొందరు మాజీ ఆటగాళ్లు తప్పు పట్టారు. రాహుల్ నాయకుడిగా పనికి రాడంటూ ఫైర్ అయ్యాడు క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్.
జట్టు పరంగా గెలుపు ఓటములు పక్కన పెడితే ఇలాంటి నాయకుడు ఉంటే ఏ ఆటగాడికైనా బాగా ఆడాలన్న ధైర్యం కలుగుతుందన్నాడు శ్రేయస్ అయ్యర్. తనకు అతడి కెప్టెన్సీలో ఆడడం చాలా ఇష్టమని చెప్పాడు.
Also Read : ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ హవా