MRO in ACB Net: 10 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకు చిక్కిన శామీర్ పేట తహసీల్దార్ !

10 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకు చిక్కిన శామీర్ పేట తహసీల్దార్ !

MRO in ACB Net: భూముల ధరలకు రెక్కలు రావడంతో… రెవిన్యూ అధికారుల అవినీతికి హద్దులేకుండా పోయింది. రెవెన్యూ పత్రాల జారీలో పారదర్శకత తీసుకురావడానికి ప్రభుత్వాలు ఎంత టెక్నాలజీను ఉపయోగిస్తున్నప్పటికీ అవినీతికి మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతుంది. దీనితో ప్రభుత్వ, వివాదాస్పద భూములకు పాసు పుస్తకాలు ఇవ్వడానికి రెవిన్యూ అధికారులు లక్షల్లో లంచాలను డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి నెలకొంది. దీనికి సోమవారం మేడ్చల్(Medchal) మాల్కాజీగిరి జిల్లా శామీర్ పేట తహాసీల్దార్ ఏసీబీ వలకు చిక్కిన ఉదంతం నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఓ వ్యక్తికి సంబంధించిన భూమికి పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేసేందుకు వెయ్యి కాదు రెండు వేలు కాదు ఏకంగా రూ. 10 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసి… దానిని తన డ్రైవర్ ద్వారా తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కారు శామీర్ పేట తహాసీల్దార్ సత్యనారాయణ. ఒక పూర్తి వివరాల్లోకి వెళితే…

MRO in ACB Net Viral

శామీర్ పేటకు చెందిన ఓ రైతు తన భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాల కోసం తహాసీల్ధారు కార్యాలయంలో కొంతకాలం క్రితం ధరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తహాసీల్దారు సత్యనారాయణను కలిసి తన పాసుపుస్తకాలు ఇప్పించవలసిందిగా కోరాడు. అయితే పాసుపుస్తకాలు మంజూరు చేయడానికి తహాసీల్ధారు సత్యనారాయణ రూ. 10 లక్షలు లంచంగా డిమాండ్ చేసారు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని ఆ రైతు… ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో పక్కా ప్రణాళికతలో తహాసీల్దారును లంచం సొమ్ముతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాధిత రైతు రూ. 10 లక్షల లంచం సొమ్మును… తహాసీల్ధార్ సత్యనారాయణ డ్రైవర్ బద్రికు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు డ్రైవర్ బద్రిను విచారించగా… తహాసీల్దార్ సత్యనారాయణ ఆదేశాల మేరకు సొమ్మును తీసుకున్నట్లు ఏసీబీ అధికారుల ముందు అంగీకరించాడు. దీనితో డ్రైవర్ బద్రితో పాటు తహసీల్ధార్ సత్యనారాయణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి… అవినీతి నిరోదక చట్టం క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : PM Surya Ghar : గుడ్ న్యూస్..దేశవ్యాప్తంగా వారికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అంటున్న ప్రధాని

Leave A Reply

Your Email Id will not be published!