MS Dhoni : ఐపీఎల్ 16వ సీజన్ లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కీలకమైన 45వ లీగ్ మ్యాచ్ కు వేదికైంది ఉత్తర ప్రదేశ్ లోని లక్నో స్టేడియం. జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ , కృనాల్ పాండ్యా నాయకత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది.
ధోనీ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది లక్నో సూపర్ జెయింట్స్. ఇంకా 4 బంతులు ఆడాల్సి ఉండగా ఉన్నట్టుండి భారీ వర్షం కురిసింది. దీంతో మ్యాచ్ ఎంతకూ కొనసాగే పరిస్థితి లేక పోవడంతో అంపైర్లు తుది నిర్ణయం తీసుకున్నారు. లీగ్ మ్యాచ్ పూర్తి కాక పోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ కు ఒక పాయింట్ లక్నో సూపర్ జెయింట్స్ ఒక పాయింట్ కేటాయిస్తున్నట్లు తెలిపారు.
దీంతో ఇరు జట్లు చెరో పాయింట్ ను పొందాయి. అంతకు ముందు టాస్ వేసిన అనంతరం ధోనీ(MS Dhoni) కీలక వ్యాఖ్యలు చేశారు. కామెంటేటర్ ఉన్నట్టుండి ఇదే మీ చివరి లీగ్ సీజన్ అని అనుకుంటా అని ప్రస్తావించారు. దీనిపై జార్ఖండ్ డైనమెంట్ వెంటనే సమాధానం ఇచ్చారు. నేను నిర్ణయం తీసుకోలేదు..మీరే నిర్ణయించారంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం ధోనీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.
Also Read : లక్నో ఆటగాళ్లకు ధోనీ పాఠాలు
