MS Dhoni LSG Players : లక్నో ఆటగాళ్లకు ధోనీ పాఠాలు
నెట్టింట్లో ఫోటో వైరల్ హల్ చల్
MS Dhoni LSG Players : జార్ఖండ్ డైనమెట్ గా ప్రేమగా పిలుచుకునే మహేంద్ర సింగ్ ధోనీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ధోనీ మోస్ట్ పవర్ ఫుల్ స్కిప్పర్ గా ఇప్పటికే పేరు పొందాడు. అంతే కాదు ఆయనతో మాట్లాడాలని, ఫోటోలు దిగాలని, చెబితే వినాలని ఉబలాట పడతారు, ఆరాటం చెందుతారు వర్ధమాన యువ ఆటగాళ్లు. ఇక ధోనీ(MS Dhoni ) ఎల్లప్పుడూ ఇలాంటి వాటికి ముందుంటాడు. ఎలాంటి భేషజాలకు పోకుండా చాలా సాధారణంగా ఇట్టే కలిసి పోతాడు. ప్రతిభ కలిగి ఉన్న ఆటగాళ్లను తనే ఎంపిక చేసుకుంటాడు.
ఆపై వారికి పూర్తి స్వేచ్ఛను ఇస్తాడు. ప్రోత్సహిస్తాడు. వారి మీద ఈగ కూలా వాలనివ్వడు. మైదానం వెలుపల ఎలా ఉంటాడో క్రీజు లోకి వచ్చాక చాలా కూల్ గా ఉంటాడు. ఇది చాలా మందిని ఆశ్చర్య పరిచేలా చేసింది. అందుకే మహేంద్ర సింగ్ ధోనీని(MS Dhoni LSG Players) మిస్టర్ కూల్ కెప్టెన్ అంటారు. ఫస్ట్ క్లాస్ నుంచి రిటైర్ అయినా ఐపీఎల్ నుంచి ఇంకా పదవీ విరమణ పొందలేదు.
ఇదిలా ఉండగా తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరిగింది. ముందుగా టాస్ గెలిచిన ధోనీ ఫీల్డింగ్ ఎంచుకోగా లక్నో 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 రన్స్ చేసింది. ఇంకా 4 బంతులు వేయాల్సి ఉండగా అర్ధాంతరంగా భారీ వర్షం కురిసింది.
దీంతో ఆటను రద్దు చేశారు. ఈ సందర్భంగా సమయం ఉండడంతో లక్నో ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోనీ వద్దకు వెళ్లారు. ఆయనతో వారు సంభాషించారు. ఈ సందర్బంగా ధోనీ ఆటగాళ్లకు విలువై సూచనలు , సలహాలు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది.
Also Read : రాజీవ్ శుక్లా సత్కారం ధోనీ సంతోషం