MS Dhoni Nayanathara : నయన్ మూవీకి ధోనీ నిర్మాత
సినీ రంగంలోకి మాజీ కెప్టెన్ ఎంట్రీ
MS Dhoni Nayanathara : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ , జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ఎంత చెప్పినా తక్కువే. భారత దేశంలో పేరొందిన ప్రముఖుల్లో అతడు ఒకడు. అంతే కాదు మోస్ట్ పాపులర్ క్రికెటర్ గా అత్యంత విలువైన వ్యక్తిగా పేరొందాడు.
అతడి ఆదాయం ప్రకటనలు, ఇతర రూపేణా దాదాపు కోట్లల్లో ఉంటోంది. ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు నాయకత్వం వహిస్తున్నాడు. గత సీజన్ లో ఆ జట్టుకు టైటిల్ అందించాడు.
ఈసారి ఐపీఎల్ లో సీన్ రిపీట్ కాలేదు. ధోనీ(MS Dhoni Nayanathara) ఇటీవలే ఫార్మింగ్ రంగంలోకి ఎంటర్ అయ్యాడు. భారీ ఎత్తున పంటల్ని పండించడంలో కీలకంగా మారాడు. ఏ మాత్రం వీలు కుదిరినా వెంటనే తన వ్యవసాయ క్షేత్రంలోకి వెళతాడు.
డెయిరీ రంగంలోకి కూడా ఎంటర్ అయినట్లు సమాచారం. దీనికి గురించి పూర్తి క్లారిటీ లేదు. తాజాగా మరో వార్త సంచలనం కలిగించింది. అదేమిటంటే ధోనీ సినీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
అదేదో నటుడిగా అనుకునేరు. కాదు లవ్లీ బ్యూటీ నయన తార (MS Dhoni Nayanathara)ప్రధాన పాత్రలో నటించబోయే లేడీ ఓరియంటెడ్ మూవీకి నిర్మాతగా మారనున్నట్లు టాక్. ఇందుకు నయన్ కూడా ఓకే చెప్పిందని సమాచారం.
ఇదిలా ఉండగా మూవీకి సంబంధించి హీరోయిన్, నిర్మాత ఓకే కాగా ఇంకా దర్శకుడు ఎవరనేది తెలియాల్సి ఉంది. కోలీవుడ్ లో టాప్ డైరెక్టర్లలో ఎవరో ఒకరు ఉంటారని అనుకుంటున్నారు సినీ వర్గాలు.
ధోనీ సామాన్యంగా పెట్టుబడి పెట్టడు. కానీ పెట్టాడంటే దాని వెనుక పెద్ద రీజన్ ఏదో అయి ఉండాలి. ఏది ఏమైనా ఈ జార్ఖండ్ డైనమెట్ ఏది చేసినా ఓ సంచలనమే.
Also Read : ఎవరీ రితికా నాయక్ ఏమిటా కథ