Mudragada Padmanabha Reddy: ముద్రగడ పద్మనాభరెడ్డిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలింపు
ముద్రగడ పద్మనాభరెడ్డిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలింపు
Mudragada Padmanabha Reddy : మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభరెడ్డిని… మెరుగైన వైద్యం కోసం కాకినాడ నుంచి హైదరాబాద్ కు తరలించారు. అయితే హైదరాబాద్ కు వెళ్ళే ముందు తన స్వగ్రామం అయిన కిర్లంపూడికి ఒక్కసారి తీసుకెళ్లాలని కోరారు. దీనితో అతడ్ని కిర్లంపూడి తరలించారు. అనంతరం హైదరాబాద్ తరలిస్తున్నారు.
Mudragada Padmanabha Reddy Health Updates
వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి (Mudragada Padmanabha Reddy) శనివారం రాత్రి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించేందుకు సిద్ధమయ్యారు. అయితే అతని ఆరోగ్యం సహకరించకపోవడంతో సామర్లకోట ఏడీబీ రోడ్డులోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డయాలసిస్ చేయగా ఆరోగ్యం నిలకడగా ఉంది.
దీనితో ముద్రగడ పద్మనాభంను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. తొలుత ఎయిర్ ఆంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుంచి తరలించాలని అనుకున్నారు. అయితే చివరకు రోడ్డు మార్గం గుండానే తీసుకొస్తున్నట్లు సమాచారం.
జగన్ కు కృతజ్ఞతలు – ముద్రగడ తనయులు
తమ తండ్రి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి (YS Jagan) ముద్రగడ కుమారులు బాలు, గిరిబాబులు కృతజ్ఞతలు తెలియజేశారు. ముద్రగడ ఆరోగ్యం నిలకడగానే ఉందని, తరలింపు నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందవద్దని వారు కోరుతున్నారు. జగన్ సూచన మేరకు ఇవాళే హైదరాబాద్‌కు తమ తండ్రిని తరలిస్తామని ప్రకటించారు.
ముద్రగడ అస్వస్థతకు గురైన విషయం తెలుసుకుని పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం ముద్రగడ తనయుడు, పార్టీ ప్రత్తిపాడు కో ఆర్డినేటర్ గిరిబాబును ఫోన్లో పలకరించారు. పద్మనాభం ఆరోగ్య పరిస్థితి, కాకినాడ ఆస్పత్రిలో అందుతున్న వైద్యం గురించి వివరాలు అడిగి తెలుకున్నారు. మెరుగైన వైద్యం కోసం అవసరమైతే ఎయిర్ అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాటు చేస్తామని, ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో కాకినాడ వైద్యులూ హైదరాబాద్ తీసుకువెళ్లడం మంచిదని చెప్పారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జగన్మోహన్రెడ్డి సాధ్యమైనంత త్వరగా ముద్రగడను ఎయిర్ అంబులెన్స్‌లో తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని పార్టీనేతలకు సూచించారు. అదివారం రాత్రి తరలించేందుకు సాంకేతికంగా ఇబ్బంది ఉండటంతో ఇవాళ తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
Also Read : Perni Nani: అజ్ఞాతంలోకి మాజీ మంత్రి పేర్ని నాని ?
