Mukesh Ambani TTD : తిరుమ‌ల‌ను ద‌ర్శించుకున్న అంబానీ

దిగ్గ‌జ వ్యాపార వేత్త‌కు సాద‌ర స్వాగ‌తం

Mukesh Ambani TTD : భార‌తీయ వ్యాపార దిగ్గ‌జం, రిల‌య‌న్స్ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ ముకేశ్ అంబానీ(Mukesh Ambani TTD) త‌న కుటుంబీకుల‌తో క‌లిసి తిరుమ‌ల‌ను ద‌ర్శించుకున్నారు.

శుక్ర‌వారం వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో పూజ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చిన్న కుమారుడు అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధిక మ‌ర్చంట్ తో క‌లిసి వ‌చ్చారు.

ఇదిలా ఉండ‌గా అంబానీ కుటుంబ సమేతంగా ఇవాళ ఉద‌యం అభిషేకం, నిజ‌పాద ద‌ర్శ‌న సేవ‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) కార్య నిర్వ‌హ‌ణ అధికారి ధ‌ర్మారెడ్డి అంబానీకి స్వాగ‌తం ప‌లికారు.

ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. ద‌ర్శ‌నం అనంత‌రం రంగ‌నాయ‌క మండ‌పంలో పండితులు వేద ఆశీస్సులు అందించారు. ఈ సంద‌ర్భంగా రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ చైర్మ‌న్ ముఖేష్ అంబానీ(Mukesh Ambani TTD) మాట్లాడారు.

తిరుమ‌ల‌ను ద‌ర్శించు కోవడం ఆనందంగా ఉంద‌న్నారు. తిరుమ‌ల‌లో దేవాల‌యం ప్ర‌తి ఏటా అభివృద్ది చెందుతోంద‌ని చెప్పారు. అంద‌రినీ ఆశీర్వ‌దించాల‌ని వేంక‌టేశ్వ‌ర స్వామిని ప్రార్థించాన‌ని తెలిపారు.

ఇదిలా ఉండగా రిల‌య‌న్స్ సంస్థ‌ల అధినేత ముకేశ్ అంబానీ వెంట చంద్ర‌గిరి వైఎస్సార్పీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి, రాజ్య‌స‌భ ఎంపీ విజ‌య సాయి రెడ్డి ఉన్నారు.

ఇదిలా ఉండ‌గా టీటీడీ ఆల‌య ట్ర‌స్టుకు ముకేశ్ అంబానీ రూ. 1.5 కోట్లు విరాళంగా ఇచ్చిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఇదిలా ఉండ‌గా క‌రూర్ వైశ్యా బ్యాంక్ సీఎస్ఆర్ కింద తిరుమ‌ల లోని టిటీడీకి 8 సీట‌ర్ బ్యాట‌రీతో న‌డిచే వాహ‌నాన్ని విరాళంగా ఇచ్చారు.

ఈవో ధర్మా రెడ్డికి బ్యాట‌రీ వాహ‌నాల తాళాలు అంద‌జేశారు కేవీబీ ఎండీ ర‌మేష్ బాబు.

Also Read : ట్ర‌బుల్ షూట‌ర్ తో ప్ర‌భాస్ భేటీ

Leave A Reply

Your Email Id will not be published!